close

Published : 11/04/2021 05:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పబ్లిక్‌ ఇష్యూకు శ్రీరామ్‌ ప్రోపర్టీస్‌

సెబీకి పత్రాల సమర్పణ

దిల్లీ: బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న శ్రీరామ్‌ ప్రోపర్టీస్‌ త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఇందుకుగాను సెబీకి సంబంధిత దరఖాస్తు పత్రాలను సమర్పించింది. ప్రతిపాదిత ఈ ఇష్యూ ద్వారా రూ.800 కోట్లు సమీకరించాలని కంపెనీ అనుకుంటోంది. సెబీకి సమర్పించిన పత్రాల ప్రకారం.. ఇష్యూలో భాగంగా రూ.250 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా మరో రూ.550 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 58 శాతం వాటా కలిగిన టీపీజీ కేపిటల్‌, టాటా కేపిటల్‌, వాల్టన్‌ స్ట్రీట్‌ కేపిటల్‌, స్టార్‌వుడ్‌ కేపిటల్‌లు ఈ ఇష్యూలో కొంత మేర వాటాను విక్రయించనున్నాయి. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించగా వచ్చే నిధులు సంబంధిత వాటాదార్లకే వెళ్తాయి. కొత్తగా విక్రయించే షేర్ల ద్వారానే కంపెనీ నిధులు సమీకరించనుంది. ఈ నిధులను రుణాల చెల్లింపునకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. ప్రధానంగా దక్షిణ భారత్‌పై ఎక్కువగా దృష్టి సారించిన శ్రీరామ్‌ ప్రోపర్టీస్‌ ఇప్పటికే పలు స్థిరాస్తి ప్రాజెక్టులను పూర్తి చేయగా.. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని