close

Published : 05/05/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పీఎల్‌ఐ కింద 19 ఐటీ కంపెనీల దరఖాస్తు

దిల్లీ: ఐటీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల తయారీ నిమిత్తం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి (పీఎల్‌ఐ) 19 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో యాపిల్‌ ఫోన్లను కాంట్రాక్టు పద్ధతిలో తయారు చేసే  ఫాక్స్‌కాన్‌, విస్ట్రోన్‌తో పాటు డెల్‌, లావా, ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ వంటి కంపెనీలున్నాయ’ని  ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పథకం ద్వారా మొత్తంగా జరిగే ఉత్పత్తి విలువ రూ.1.6 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలిపింది. ఇందులో ఐటీ హార్డ్‌వేర్‌ కంపెనీలే రూ.1.35 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను తయారు చేసేందుకు ప్రతిపాదనలు పంపాయి. 14 దేశీయ కంపెనీలు రూ.25,000 కోట్లకు పైగా ఉత్పత్తులను తయారు చేయనున్నాయి.ఇందులో డిక్సన్‌, ఇన్ఫోపవర్‌, భగవతి (మైక్రోమాక్స్‌), సిర్మా, ఆర్బిక్‌ తదితర కంపెనీలు ఉన్నాయి.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని