ప్రపంచంలోనే తొలి 2 నానోమీటర్‌ చిప్‌
close

Published : 07/05/2021 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రపంచంలోనే తొలి 2 నానోమీటర్‌ చిప్‌

ఆవిష్కరించిన ఐబీఎమ్‌
పెరగనున్న ‘ఇంటర్నెట్‌’ వేగం, బ్యాటరీ లైఫ్‌

దిల్లీ: ప్రపంచంలోనే తొలిసారిగా 2 నానోమీటర్‌(ఎన్‌ఎమ్‌) నానోషీట్‌ టెక్నాలజీతో చిప్‌ను అభివృద్ధి చేసినట్లు సాంకేతిక దిగ్గజం ఐబీఎమ్‌ పేర్కొంది. దీని వల్ల ఇంటర్నెట్‌ యాక్సెస్‌ వేగం, బ్యాటరీ జీవితకాలం పెరుగుతుందని, ప్రాసెసింగ్‌ సమయం బాగా తగ్గుతుందని వివరించింది. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కమ్యూనికేషన్‌ పరికరాలు, రవాణా వ్యవస్థలన్నిటిలోనూ సెమీ కండక్టర్లు కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. తాజా ఆవిష్కరణతో లాప్‌టాప్‌లో వినియోగదార్లు చేసే పనులు(ఫంక్షన్లు) చాలా వేగంగా పూర్తవుతాయని ఐబీఎమ్‌ అంటోంది. అలాగే స్వయం చోదిత కార్లలో స్పందన సమయం తగ్గేందుకు; వేగంగా వస్తువులు/మనుషులను గుర్తించడానికి ఇది ఉపయోపడుతుందనీ తెలిపింది. చిప్‌ పనితీరు మెరుగ్గా ఉంటే ఇంధన సామర్థ్యం కూడా పెరుగుతుందని, ప్రస్తుత హైబ్రిడ్‌ క్లౌడ్‌, కృత్రిమ మేధ(ఏఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ) యుగంలో అది ఎంతో ముఖ్యమని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతమున్న అత్యాధునిక 7 ఎన్‌ఎమ్‌ నోడ్‌ చిప్‌లతో పోలిస్తే 45 శాతం అధిక పనితీరు(లేదా 75 శాతం తక్కువ ఇంధన వినియోగం)ను ప్రదర్శిస్తుందని ఐబీఎమ్‌ తెలిపింది. కాగా, ఈ 2 ఎన్‌ఎమ్‌ ప్రాసెసర్లతో వినియోగదారు వస్తువులను ఎపుడు తయారు చేస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని