కంపెనీల బోర్డుల్లో స్వతంత్ర డైరెక్టర్లు తగ్గుతున్నారు
close

Published : 15/05/2021 05:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కంపెనీల బోర్డుల్లో స్వతంత్ర డైరెక్టర్లు తగ్గుతున్నారు

పీఎస్‌యూలే ప్రధాన కారణం

దిల్లీ: దేశీయంగా కంపెనీల బోర్డుల్లోని మొత్తం స్వతంత్ర డైరెక్టర్ల (ఐడీలు) సంస్థ 2018, 2019తో పోలిస్తే 2020లో తక్కువగా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) బోర్డుల్లో వీరిని నియమించకపోవడమే ఇందుకు కారణమని ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ ఇండియా అధ్యయన నివేదిక వెల్లడించింది. 2018లో మొత్తం నిఫ్టీ 500 కంపెనీల్లో స్వతంత్ర డైరెక్టర్లు 2,494 మంది ఉండగా, 2019కి ఈ సంఖ్య 2,396కు తగ్గింది. 2020 డిసెంబరు ఆఖరుకు 2,249 మందే ఉన్నారు. నిఫ్టీ 500 సూచీ నుంచి కొన్ని కంపెనీలు బయటకు రావడం, కొత్తగా ఈ జాబితాలో చేరిన కంపెనీల బోర్డుల్లో స్వతంత్ర డైరెక్టర్లు తక్కువగా ఉండటం కూడా మొత్తంమ్మీద సంఖ్య తగ్గడానికి కారణమవుతోంది. 2019తో పోలిస్తే 2020లో బయటకు వెళ్లిన కంపెనీల్లో 208 మంది ఐడీలుండగా, కొత్తగా చేరిన కంపెనీల్లో 188 మందే ఐడీలు ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. 2018తో పోలిస్తే బయటకు వెళ్లిన ఐడీలు 395 మంది కాగా, కొత్తగా జతయిన కంపెనీల్లో ఐడీలు 331 మంది కావడం గమనార్హం. నిఫ్టీ 500లోని పీఎస్‌యూల్లోని ఐడీలు 133 మందే ఉన్నారు. నిఫ్టీ 500 కంపెనీల్లో 2019, 2020ల్లో 72 పీఎస్‌యూలు ఉన్నాయి. సెబీ లిస్టింగ్‌ మార్గదర్శకాల ప్రకారం, పీఎస్‌యూలు ఇంకా 141 మంది ఐడీలను నియమించుకోవాల్సి ఉంది. 2020 డిసెంబరు 31 నాటికి 14 శాతం (70 కంపెనీలు) బోర్డులు నిబంధనల ప్రకారం లేవు. ఇందులో 55 కంపెనీలు పీఎస్‌యూలే. ఇక్కడ బోర్డుల స్వతంత్రత అనేది ఎప్పుడూ సమస్యే.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని