యూనియన్‌ బ్యాంక్‌ లాభం రూ.1120 కోట్లు
close

Published : 30/07/2021 04:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూనియన్‌ బ్యాంక్‌ లాభం రూ.1120 కోట్లు

దిల్లీ: ప్రభుత్వ రంగ యూనియన్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో రూ.1,120.15 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ.340.95 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే మార్చి త్రైమాసిక లాభం      రూ.1,269.18 కోట్లతో పోలిస్తే, జూన్‌ త్రైమాసికంలో తగ్గింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఆదాయం రూ.20,487.01 కోట్ల నుంచి రూ.20,666.62 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలు, ఆకస్మిక నిధికి కేటాయింపులు రూ.3,590.22 కోట్ల నుంచి రూ.3,593.33 కోట్లకు పెరిగాయి. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) 14.95% (రూ.97,189.95 కోట్లు) నుంచి 13.60 శాతానికి (రూ.87,762.19 కోట్లు) తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 4.97 శాతం (రూ.28,913.50 కోట్లు) నుంచి 4.69 శాతానికి (రూ.27,437.45 కోట్లు) పరిమితమయ్యాయి. స్టాండలోన్‌ ప్రాతిపదికన నికర లాభం రూ.332.74 కోట్ల నుంచి మూడింతలై రూ.1,180.98 కోట్లుగా నమోదైంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని