గృహ రుణాలపై ఎస్‌బీఐ ఆఫర్లు
close

Published : 17/09/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గృహ రుణాలపై ఎస్‌బీఐ ఆఫర్లు

ముంబయి: కొత్తగా గృహ రుణాలు తీసుకోబోయే వినియోగదార్లకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పండుగ ఆఫర్లను ప్రకటించింది. రుణమొత్తంతో సంబంధం లేకుండా.. వినియోగదారు క్రెడిట్‌ స్కోరు ఆధారంగా గృహ రుణాన్ని 6.7 శాతం ప్రారంభ వడ్డీతో అందించనుంది. అంతక్రితం రూ.75 లక్షలపైన గృహ రుణాలకు 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. తాజా ఆఫర్‌ కింద ఏ మొత్తానికైనా తక్కువలో తక్కువ 6.7 శాతం వడ్డీ వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది. 45 బేసిస్‌ పాయింట్లు తగ్గడం వల్ల 30 ఏళ్ల కాలావధికి తీసుకునే రూ.75 లక్షల రుణంపై రూ.8 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని వడ్డీ రూపేణ ఆదా చేసుకోవచ్చని వివరించింది.

ప్రాసెసింగ్‌ ఫీజు రద్దు: అంతక్రితం వేతన జీవులతో పోలిస్తే ఇతరులకు గృహ రుణాలపై 15 బేసిస్‌ పాయింట్లు (0.15%) అధికంగా వడ్డీ విధించేవారు. ఇపుడు ఆ అసమానతను తొలగించారు. దీంతో వృత్తితో సంబంధం లేకుండా అందరికీ తక్కువ వడ్డీకే గృహరుణం లభిస్తుందని బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌(రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌) సి.ఎస్‌.శెట్టి పేర్కొన్నారు. వేరే బ్యాంకులో ఉన్న గృహ రుణాన్ని ఎస్‌బీఐకి మార్చుకునే వారికీ 6.7% వడ్డీయే వర్తిస్తుందని ఆయన తెలిపారు. ప్రాసెసింగ్‌ ఫీజును సైతం రద్దు చేసినట్లు తెలిపారు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సైతం

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తన రిటైల్‌ రుణ వినియోగదార్ల కోసం పండుగ ఆఫర్లను తీసుకొచ్చింది. ‘బరోడా హోమ్‌ లోన్స్‌’, ‘బరోడా కార్‌ లోన్స్‌’కు సంబంధించి ప్రస్తుతమున్న వడ్డీరేట్లపై 0.25% మినహాయింపు ఇచ్చింది. ప్రస్తుతం బ్యాంకు గృహ రుణ రేట్లు 6.75% నుంచి; కారు రుణ రేట్లు 7% నుంచి ప్రారంభమవుతున్నాయి. గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజునూ రద్దు చేసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని