గ్లాన్స్‌ ఇన్‌మొబిలో రిలయన్స్‌కు వాటా!
close

Published : 28/09/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్లాన్స్‌ ఇన్‌మొబిలో రిలయన్స్‌కు వాటా!

రూ.2250 కోట్ల వరకు పెట్టుబడులు

భారత్‌కు చెందిన మొబైల్‌ కంటెంట్‌ ప్రొవైడరు గ్లాన్స్‌ ఇన్‌మొబిలో వాటా కొనుగోలు కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) సంప్రదింపులు జరుపుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. గూగుల్‌ మద్దతు ఉన్న ఈ యూనికార్న్‌ సంస్థలో ఆర్‌ఐఎల్‌ 300 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2250 కోట్ల) వరకు పెట్టుబడులు పెట్టాలని భావిస్తోందని ఒక ఆంగ్ల పత్రిక తెలిపింది. కొద్దివారాల్లో ఈ లావాదేవీ పూర్తి కావొచ్చని సమాచారం.

జియో స్మార్ట్‌ఫోన్‌కు ప్రయోజనం: ఫోన్‌ లాక్‌ స్క్రీన్‌లపై వార్తలు, వినోద కంటెంట్‌ను అందించే గ్లాన్స్‌ మొబికి రొపోసో పేరిట షార్ట్‌ వీడియో యాప్‌ ఉంది. ఆ సంస్థకు ఆర్థిక మద్దతుతో పాటు వ్యూహాత్మక సహకారం కూడా రిలయన్స్‌ పెట్టుబడుల్లో భాగంగా ఉండొచ్చనీ చెబుతున్నారు. గూగుల్‌తో కలిసి రిలయన్స్‌ తీసుకొస్తున్న అందుబాటు ధర స్మార్ట్‌ఫోన్‌ కు ఈ లావాదేవీ వల్ల ప్రయోజనం ఉండొచ్చు. దీపావళి సీజనులో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తేనున్నారు. ఈ లావాదేవీ జరిగితే.. ప్రస్తుతం వినియోగదార్లు భారీగా పెరుగుతున్న షార్ట్‌ వీడియో విభాగంలోకి రిలయన్స్‌ వ్యూహాత్మకంగా ప్రవేశించినట్లు అవుతుంది.  2019లో ఏర్పాటైన గ్లాన్స్‌ ఇన్‌మొబికి 13 కోట్ల మంది రోజువారీ వినియోగదార్లున్నారు. ఈ కంపెనీకి చెందిన రొపోసో యాప్‌ డజను భారతీయ భాషల్లో షార్ట్‌ వీడియోలను ఆఫర్‌ చేస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని