పెట్టుబడిదార్లకు పుష్కల అవకాశాలు
close

Published : 18/10/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్టుబడిదార్లకు పుష్కల అవకాశాలు

అమెరికా సీఈఓలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూయార్క్‌: అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు తోడు దేశంలో స్పష్టమైన అభిప్రాయాలు, నిబద్ధత గల నాయకత్వం వల్ల మదుపర్లకు, పరిశ్రమ వాటాదార్లకు భారత్‌లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అమెరికా కంపెనీల సీఈఓలకు వెల్లడించారు. పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ, యూఎస్‌-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్‌ నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్‌ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలకు భారత్‌లో ఉన్న అవకాశాలను వివరించారు. భారత దేశంలో అంకుర సంస్థలు బాగా పెరిగాయని, ఇప్పుడు చాలా మంది కేపిటల్‌ మార్కెట్ల ద్వారా నిధుల్ని సేకరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ఏడాదిలోనే 16 అంకుర సంస్థలు యూనికార్న్‌ (రూ.7,500 కోట్లకు పైగా విలువైన కంపెనీలు) అర్హత సాధిస్తున్నాయని పేర్కొన్నారు. మాస్టర్‌కార్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ అజయ్‌ బంగా, సీఈఓ మైఖేల్‌ మీబాచ్‌, ఫెడ్‌ఎక్స్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ రాజ్‌ సుబ్రమణియమ్‌, సిటీ సీఈఓ జాన్‌ ఫ్రాసర్‌, ఐబీఎం ఛైర్మన్‌, సీఈఓ అరవింద్‌ కృష్ణ తదితరులకు భారత్‌లో ఉన్న అవకాశాలను ఆమె వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని