రితికాలో 52 శాతం వాటా కొనుగోలు
close

Published : 20/10/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రితికాలో 52 శాతం వాటా కొనుగోలు

ఆర్‌ఆర్‌వీఎల్‌ డైరెక్టర్‌ ఈశా అంబానీ

దిల్లీ: ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ రీతు కుమార్‌కు చెందిన రితికా ప్రై.లి.లో 52 శాతం వాటాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అనుబంధ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) కొనుగోలు చేసింది. ఎంత మొత్తానికి ఈ కొనుగోలు జరిగిందనేది వెల్లడించలేదు. కంపెనీలో అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ ఎవర్‌స్టోన్‌కు ఉన్న మొత్తం 35 శాతం వాటాను ఆర్‌ఆర్‌వీఎల్‌ కొనుగోలు చేసిందని రితికా ప్రై.లి. వెల్లడించింది. రీతు కుమార్‌ సంస్థకు 4 ఫ్యాషన్‌ బ్రాండ్‌ పోర్ట్‌ఫోలియోలు, అంతర్జాతీయంగా 151 పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ (పీఓఎస్‌) ఉన్నాయి. గత వారం రిలయన్స్‌ బ్రాండ్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌బీఎల్‌), ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రాకు చెందిన ఎంఎం స్టైల్స్‌ ప్రై.లి.లో 40 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. ‘చాలా తక్కువ దేశాల్లోనే డిజైన్‌లో ఆధునికత, శైలి, వాస్తవికత ఉంటున్నాయి. మన దేశంలో దుస్తులపై ప్రింటింగ్‌, పెయింటింగ్‌తో పాటు నేత కూడా ప్రత్యేకంగా ఉంటుంది. బలమైన బ్రాండ్‌ గుర్తింపు, ఫ్యాషన్‌, రిటైల్‌ ఆవిష్కరణలు కలిగి ఉన్న రీతు కుమార్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకోవడంతో లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ను పూర్తిస్థాయిలో నిర్మించినట్లు అవుతుంద’ని ఆర్‌ఆర్‌వీఎల్‌ డైరెక్టర్‌ ఈశా అంబానీ వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని