వచ్చే ఆర్థిక సంవత్సరంలో హోండా ప్రారంభ స్థాయి బైకు
close

Updated : 26/10/2021 10:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వచ్చే ఆర్థిక సంవత్సరంలో హోండా ప్రారంభ స్థాయి బైకు

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో సరికొత్త ప్రారంభ స్థాయి మోటార్‌ సైకిల్‌ను తీసుకొచ్చేందుకు హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులు తుది దశకు చేరాయని కంపెనీ ఎండీ, సీఈఓ అత్సుషి ఒగాటా పేర్కొన్నారు. ప్రారంభ స్థాయి మోడల్‌తో గ్రామీణ, సెమీ-అర్బన్‌ ప్రాంతాల్లో విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. సీడీ 110 శ్రేణి కంటే దిగువన ఈ బైకు ఉండనుంది. సరఫరాదారులతో అన్ని రకాల అధ్యయనాలు పూర్తి చేశామని, ప్రస్తుతం బైకు అభివృద్ధి జపాన్‌లో జరుగుతున్నట్లు ఒగాటా వెల్లడించారు. దేశీయ విపణిలో కొత్త మోడల్‌ కంపెనీ నుంచి అత్యంత చౌక బైకుగా నిలవనుంది. 125సీసీ మోడళ్లు షైన్‌, ఎస్‌పీ 125 అమ్మకాలు అంచనాలకు మించి ఉన్నట్లు వివరించారు.
రేసు కార్లకు హైడ్రోజన్‌ కంబస్టన్‌ ఇంజిన్లు: రేసు కార్లలో హైడ్రోజన్‌ కంబస్టన్‌ ఇంజిన్‌లను పరీక్షిస్తున్నట్లు టయోటా ప్రకటించింది. వాణిజ్య ఉత్పత్తుల్లో ఇటువంటి టెక్నాలజీ వినియోగంపై కంపెనీ కృషి చేస్తోంది. ఇటువంటి ఇంజిన్లలో గ్యాసోలిన్‌ స్థానంలో హైడ్రోజన్‌ను ఇంధనంగా వినియోగిస్తారు. రేసు కార్లలో వినియోగంతో వచ్చిన డేటాను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని