భారత అంకురాల కోసం గూగుల్‌, మైటీల ఒప్పందం
close

Published : 28/10/2021 03:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత అంకురాల కోసం గూగుల్‌, మైటీల ఒప్పందం

త్వరలో యాప్‌స్కేల్‌ అకాడమీ ఆవిష్కరణ

దిల్లీ: భారత అంకురాలు అత్యంత నాణ్యమైన యాప్‌లను రూపొందించడంలో సహాయం చేయడం కోసం ‘యాప్‌స్కేల్‌ అకాడమీ’ రాబోతోంది. దీనిని ఆవిష్కరించడానికి గూగుల్‌, మైటీ స్టార్టప్‌ హబ్‌లు జట్టు కట్టాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైటీ స్టార్టప్‌ హబ్‌ ఏర్పాటైన సంగతి తెలిసిందే. యాప్‌స్కేల్‌ అకాడమీ అనేది అంకురాలకు ప్రారంభ స్థాయి నుంచి మధ్యస్థాయి వరకు సహాయం చేస్తుంది. గేమింగ్‌, ఆరోగ్యసంరక్షణ, ఫిన్‌టెక్‌, ఎడ్‌టెక్‌, సామాజిక ప్రభావం, ఇతరత్రాల్లోని అన్ని విభాగాల్లో ప్రపంచ స్థాయి యాప్‌లను రూపొందించడంలో, ఎదిగేలా చేయడంలో చేయూతనిస్తుందన్నమాట. 

దరఖాస్తులు ఎప్పటి నుంచంటే..: ఈ కార్యక్రమం కింద అంకురాలు డిసెంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన వాటిలో నాణ్యత, పరిమాణం పరంగా ఉన్న పరామితులను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమ నిపుణులు, మైటీ స్టార్టప్‌ హబ్‌, గూగుల్‌ ప్లే సభ్యులు 100 అంకురాలను ఎంపిక చేస్తారు. ఆరు నెలల ప్రోగ్రామ్‌ కింద ఎంపికైన అంకురాలకు డేటా భద్రత, మానిటైజేషన్‌, యూఎక్స్‌ డిజైన్‌, అంతర్జాతీయ మార్కెట్‌ విస్తరణ ఇలా.. అన్నింటిలోనూ శిక్షణ ఇస్తారు. భారత్‌లో అంకుర వ్యవస్థపై మేం అత్యంత ఆసక్తిగా ఉన్నాం.

భారత్‌కే కాదు ప్రపంచానికీ పరిష్కారాలందించే సత్తా దీనికి ఉంది. భారత అంకురాలు, డెవలపర్లు.. ప్రపంచం అనుసరించే ఉదాహరణలను ఆవిష్కరించగలరని గూగుల్‌ ప్లే విశ్వసిస్తోంద’ని గూగుల్‌ ప్లే పార్టనర్‌షిప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పూర్ణిమ కొచికర్‌ అంటున్నారు. భారత అంకురాలకు అంతర్జాతీయ స్థాయికి వెళ్లే సత్తా ఉంది. వాటికి అందుకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని మైటీ కార్యదర్శి అజయ్‌ సానే పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని