స్థిరమైన రాబడి ఆర్జించేలా..
close

Published : 25/06/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్థిరమైన రాబడి ఆర్జించేలా..

టాటా మ్యూచువల్‌ ఫండ్‌ రుణ విభాగంలో ఒక కొత్త ఫ్లోటింగ్‌ రేట్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. టాటా ఫ్లోటింగ్‌  రేట్‌ అనే ఈ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ  ముగింపు తేదీ వచ్చే నెల 5. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ‘డెట్‌ స్కీమ్‌- ఫ్లోటర్‌ ఫండ్‌’ విభాగానికి చెందుతుంది. ఈ ఫండ్‌ కింద సేకరించిన నిధులను ప్రధానంగా ఫ్లోటింగ్‌ రేట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడిగా పెడతారు. తద్వారా స్థిరమైన  ఆదాయాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు.

ఫ్లోటింగ్‌ రేట్‌ ఫండ్లకు ప్రధానంగా వడ్డీరేటు రిస్కు,   లిక్విడిటీ రిస్కు ఉంటాయి. ప్రస్తుతం మనదేశంలో వడ్డీరేట్లు ఎంతో తక్కువగా ఉండగా, నగదు లభ్యత అధికంగా ఉండటం, ద్రవ్యోల్బణం పెరిగిపోయే ముప్పు పొంచి ఉండటం, మళ్లీ వడ్డీ రేట్లు పెరిగే ప్రమాదం కనిపించటం... ప్రధానంగా గమనించాల్సిన అంశాలు. అదే సమయంలో పెట్టుబడికి తగినంతగా ఫ్లోటింగ్‌ రేట్‌ రుణ పత్రాలు కూడా లభించవు. అందువల్ల  ఈ విభాగంలో లిక్విడిటీ ఎంతో తక్కువ. ఈ పరిస్థితుల్లో ఫ్లోటింగ్‌ రేట్‌ ఫండ్ల నిర్వహణలో ఫండ్‌ మేనేజర్‌ ఎంతో   నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో  మెరుగైన ప్రతిఫలాన్ని రాబట్టలేని పరిస్థితి ఉత్పన్నం అవుతుంది.

వడ్డీ రేట్లు పెరిగే తరుణంలో ఫ్లోటింగ్‌ రేట్‌ ఫండ్స్‌లో పెట్టుబడి ‘హెడ్జింగ్‌’ కింద పరిగణించే వారు ఉన్నారు. కానీ దాని కోసం ఫండ్‌ మేనేజర్‌ తక్కువ రుణ నాణ్యత (క్రెడిట్‌ క్వాలిటీ) ఫ్లోటింగ్‌ రేట్‌ పత్రాల వైపు మొగ్గుచూపాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో అన్ని రకాలైన మదుపరులకు ఫ్లోటింగ్‌ రేట్‌ ఫండ్స్‌ సరిపడవు. ఈ విభాగంపై తగిన అవగాహన కలిగిన వారికి, తమ డెట్‌ ఫండ్ల పోర్ట్‌ఫోలియోను వివిధీకరణ (డైవర్సిఫికేషన్‌) చేయాలనుకునే వారికి టాటా ఫ్లోటింగ్‌ రేట్‌ ఫండ్‌ పరిశీలనార్హం.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని