ల్యాప్‌టాప్‌ల తయారీకి కేంద్రం ప్రోత్సాహకాలు - govt clears pli scheme to boost manufacturing of laptops tablets pcs
close

Updated : 24/02/2021 21:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ల్యాప్‌టాప్‌ల తయారీకి కేంద్రం ప్రోత్సాహకాలు

దిల్లీ: దేశీయంగా ఐటీ హార్డ్‌వేర్‌ తయారీని ప్రోత్సహించే దిశగా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రంగానికి రూ.7,350 కోట్ల విలువ చేసే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాల(పీఎల్‌ఐ) పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బుధవారం ప్రకటన చేశారు. ప్రపంచస్థాయిలో భారత్‌ను తయారీ కేంద్రంగా నిలిపే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. దీంతో దేశీయంగా ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు ఎగుమతులు ఊపందుకుంటాయని పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్ల పాటు ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్స్‌, ఆల్-ఇన్‌-వన్‌ పీసీలు, సర్వర్ల వంటి ఐటీ ఆధారిత హార్డ్‌వేర్‌ పరికరాల తయారీకి రూ.7,350 కోట్ల ప్రోత్సాహకాలు అందుతాయన్నారు. దీంతో రాబోయే నాలుగేళ్లలో ఈ రంగంలో రూ.3.26 లక్షల కోట్లు విలువ చేసే ఉత్పత్తి, రూ.2.45 లక్షల కోట్లు విలువ చేసే ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

ఇటీవలే టెలికాం పరికరాల తయారీ రంగానికి ప్రభుత్వం రూ.12,195 కోట్ల పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఏప్రిల్‌లో మొబైల్, వాటి పరికరాల తయారీకీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. అది విజయవంతం కావడంతో మరిన్ని రంగాలకూ పీఎల్‌ఐ పథకాన్ని  విస్తరిస్తున్నారు.

ఇవీ చదవండి...

వేతనాలు 7.7% పెరుగుతాయ్‌

2.6 ల‌క్ష‌ల వినియోగ‌దారులకు పేటీఎమ్ రీఫండ్


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని