ఇంటర్నెట్‌డెస్క్: ఈ నెల 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ బుధవారం వెల్లడించారు. ఈ సమావేశం వర్చువల్ విధానంలో జరగనుందని తెలిపారు. ఇప్పటికే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానం పంపామన్నారు. ప్రతి పార్లమెంట్ సెషన్‌కు మందు అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. కానీ, ఈ సారి దానికి భిన్నంగా సెషన్ 29వ తేదీనే మొదలవుతుండగా.. మీటింగ్‌ను మాత్రం 30వ తేదీన ఏర్పాటు చేశారు.
‘‘అఖిలపక్ష సమావేశం ఈ నెల 30వ తేదీన జరుగుతుంది. ఈ సారి పార్లమెంట్ సెషన్లో అజెండాను పార్టీల ఎదుట ఉంచి.. వారి సలహాలను స్వీకరిస్తాం’’ అని జోషి పీటీఐకు వెల్లడించారు. 29వ తేదీన మొదలయ్యే బడ్జెట్ సెషన్‌ను రెండు భాగాలుగా నిర్వహించనున్నారు. తొలిభాగం ఫిబ్రవరి 15వ తేదీన ముగియనుంది. రెండో భాగం మార్చి 8వ తేదీన మొదలై.. ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగుతుంది. రెండు షిఫ్ట్‌ల్లో పార్లమెంట్ పనిచేస్తుంది. వీటిల్లో ఉదయం రాజ్యసభ.. సాయంత్రం లోక్‌సభ నిర్వహిస్తారు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?