కొవిడ్-19 సమయంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్లు.. - smart investors buying gold during covid 19
close

Published : 24/12/2020 16:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్-19 సమయంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్లు..

కొవిడ్ -19 లాక్ డౌన్ భారతదేశంతో సహా ప్రపంచంలోని అన్ని బంగారు మార్కెట్లలో కార్యకలాపాలను అడ్డుకుంది

ప్రస్తుతం కోవిడ్ -19 మహమ్మారిని అంతం చేసే వరకు, ఆర్ధిక అనిశ్చితి కొనసాగే వరకు అందరి ద్రుష్టి బంగారంపై కొనసాగుతుంది. ఇతర ఆస్తులతో (ఈక్విటీ, డెట్, రియల్ ఎస్టేట్) పాటు బంగారాన్ని కూడా ఆస్తిగా పరిగణిస్తున్నారు, అలాగే విపత్కర సమయంలో బంగారం మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఇది పెట్టుబడిదారుల మూలధన నష్టాలు, సంపదపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ఇతర నష్టాల నుంచి రక్షిస్తుంది.

ప్రపంచ వృద్ధిని బలహీనపరుస్తుంది :

ఆర్థిక అనిశ్చితి, తక్కువ వడ్డీ రేట్లు, ప్రపంచ ఆర్థిక వృద్ధి బలహీనపడటం ఈ ఏడాది బంగారం ధరలపై ప్రభావం చూపుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజీసీ) ఆశిస్తోంది. కరోనా వైరస్ కారణంగా తలెత్తిన అనిశ్చితి, ప్రజల భద్రత, ఆర్థిక వృద్ధిపై ప్రభావాన్ని చూపుతుందని డబ్ల్యుజీసీ తెలిపింది.

కోవిడ్ -19 లాక్ డౌన్, భారతదేశంతో సహా ప్రపంచంలోని అన్ని బంగారు మార్కెట్లలో కార్యకలాపాలను అడ్డుకుంది. రూపాయి పరంగా, మార్చి నెలలో 10 గ్రాముల బంగారం ధర 3.2 శాతం కరెక్ట్ చేయడం జరిగింది, అయినప్పటికీ 10 గ్రాముల ధర రూ. 40,000 లకు పైగా ఉంది. జనవరి నుంచి మార్చి 2020 త్రైమాసికంలో బంగారం దాదాపు 5 శాతం పెరిగింది.

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం, వృద్ధికి తోడ్పడటానికి అనుకూలమైన ద్రవ్య విధాన వైఖరిని అవలంబించడం కారణంగా బంగారు ఈటీఎఫ్‌లు సానుకూల భాగస్వామ్యాన్ని సాధించాయి. గ్లోబల్ బంగారు-ఆధారిత ఈటీఎఫ్‌లు, వాటి అనుబంధ ఉత్పత్తులు 2020 మొదటి త్రైమాసికంలో అన్ని ప్రాంతాలలో 298 టన్నులు లేదా 23 బిలియన్ డాలర్ల నికర ప్రవాహాన్ని జోడించాయి.

స్మార్ట్ ఇన్వెస్టర్లు బంగారం కొంటున్నారు :

ప్రస్తుతం స్మార్ట్ ఇన్వెస్టర్లు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఆభరణాలు, భౌతిక బంగారం కోసం ప్రస్తుతం డిమాండ్ బాగానే ఉంది. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు కూడా వాటి నష్టాన్ని గుర్తించి వారి బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయి. సెంట్రల్ బ్యాంకుల రిజర్వ్ నిర్వహణలో బంగారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఈక్విటీలలో కొనసాగుతున్న తీవ్ర అల్లకల్లోలం కారణంగా, బంగారం మంచి రాబడిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గత సంవత్సరం అనగా, 2019 లో బంగారం 25 శాతం రాబడిని నమోదుచేసింది, అదే సమయంలో ఇతర ఆస్తి తరగతులు ఆశించిన రాబడులను సాధించలేదు.

బంగారంలో పెట్టుబడి పెట్టడం :

కోవిడ్ -19 మహమ్మారి ఉండే వరకు, ఆర్థిక అనిశ్చితి కొనసాగే వరకు బంగారంపై స్పాట్‌లైట్ కొనసాగుతుంది. వ్యూహాత్మకంగా బంగారాన్ని కొనడం మంచి పరిణామమే. చాలా కాలం నుంచి బంగారం ధర పెరిగే తీరు, బంగారాన్ని సొంతం చేసుకోవాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

ప్రస్తుత పరిస్థితిలో, మొత్తం పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 10 నుంచి 15 శాతం బంగారానికి కేటాయించడం గురించి ఆలోచించండి, అలాగే దానిని దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణించండి. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్ లు) లేదా గోల్డ్ సేవింగ్ ఫండ్స్ ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టండి. ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారం సమర్థవంతమైన పోర్ట్‌ఫోలియో డైవర్సిఫైయర్‌గా తన పాత్రను కొనసాగిస్తుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని