close
ఆంధ్రా బ్యాంకు రూ.2000 కోట్ల మూలధన సమీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రా బ్యాంకు రూ.2000 కోట్ల మూలధన నిధులు సమీకరించనుంది. దీని కోసం సంస్థాగత మదుపరులకు క్యూఐపీ పద్ధతిలో కానీ లేదా ఎఫ్‌పీఓ (ఫాలో-ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌) లేదా ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్లను ముఖ విలువ (రూ.10) కు కొంత ప్రీమియం నిర్ణయించి జారీ చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ నిధుల సమీకరణ పూర్తి చేయాలనేది ఆలోచన. దీనికి అవసరమైన అనుమతుల సేకరణ ప్రక్రియను చేపడతారు. సోమవారం నాడు జరిగిన బోర్డు సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.