close

ప్రధానాంశాలు

వేడినీళ్లలో కలిపితే కాఫీ సిద్ధం

సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ ప్రీ-మిక్స్‌ కాఫీపొడి

ఈనాడు, హైదరాబాద్‌: ఇన్‌స్టెంట్‌ కాఫీ తయారీ కంపెనీ అయిన సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ ‘దిస్‌’ బ్రాండు కింద కొత్తదైన టూ-ఇన్‌-వన్‌ ప్రీ-మిక్స్‌ కాఫీని విపణిలో విడుదల చేసింది. ఒక కప్పు వేడి నీళ్లలో ఈ ఇన్‌స్టెంట్‌ క్రీమీ కాఫీ పొడి వేసుకుంటే వెంటనే కాఫీ తయారవుతుంది. పంచదార కలపని, 16 గ్రాముల సాచెట్‌ లలో ఈ కాఫీ పొడిని రూ.10 చొప్పున విక్రయిస్తామని సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ వెల్లడించింది.   10 సాచెట్‌లు ఉండే బాక్సులను విక్రయిస్తారు. దేశవ్యాప్తంగా సూపర్‌మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో ఇది లభిస్తుందని, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, బిగ్‌బాస్కెట్‌ వంటి ఆన్‌లైన్‌ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చని సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ మార్కెటింగ్‌ విభాగం అధిపతి ప్రీతమ్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.