close

ప్రధానాంశాలు

మూడు కొత్త మార్గాల్లో ‘ట్రూజెట్‌’ విమాన సర్వీసులు

ఈనాడు, హైదరాబాద్‌: కర్నాటక రాష్ట్రంలోని బెళగావి (గతంలో బెల్గాం) నుంచి తిరుపతి, మైసూరు, హైదరాబాద్‌ మార్గాల్లో మూడు కొత్త విమాన సర్వీసులను ‘ట్రూజెట్‌’ ప్రవేశపెట్టింది. ఆర్‌సీఎస్‌-ఉడాన్‌ పధకం కింద ప్రవేశపెట్టిన ఈ సర్వీసులు రోజూ ఉంటాయని ట్రూజెట్‌ వెల్లడించింది. ప్రస్తుతం బెళగావి నుంచి ఈ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు లేవు. దీంతో దాదాపు 18 గంటల రైలు ప్రయాణం లేదా 15 గంటల రోడ్డు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇకపై విమానంలో గంట- గంటన్నర వ్యవధిలో గమ్యం చేరుకోవచ్చు. 72 సీట్లు ఉండే ఏటీఆర్‌ 72 (500) విమానాలను ఈ రూట్లలో ప్రవేశపెట్టినట్లు ట్రూజెట్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఉడాన్‌ పథకం కింద 32 విమాన సర్వీసులను ఈ సంస్థ నిర్వహిస్తోంది. కొత్తగా మూడు మార్గాల్లో ప్రవేశపెట్టిన సర్వీసులతో కలిపి ఈ సంఖ్య 38కి చేరుతుంది. బెళగావిలో నుంచి రోజూ మధ్యాన్నం 1 గంటకు బయలుదేరి 2.25 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. తిరిగి 3.55 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి 5.20 గంటలకు బెళగావి చేరుతుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.