close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దివాలా కంపెనీల షేర్ల కొనుగోలుపై ఐటీ మినహాయింపు: సీబీడీటీ

దిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటూ ప్రభుత్వ అధీనంలోకి డైరెక్టర్ల బోర్డులు వెళ్లిన కంపెనీల షేర్లను మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఆదాయపు పన్ను వర్తించదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పష్టం చేసింది. రుణ సంక్షోభంలో చిక్కుకున్న యెస్‌ బ్యాంక్‌ షేర్ల కొనుగోలు విషయంలోనూ ఇదే మినహాయింపు లభిస్తుందని తెలిపింది. యెస్‌ బ్యాంక్‌ పునర్‌వ్యవస్థీకరణ పథకం- 2020లో భాగంగా పెట్టుబడిదార్లకు, పెట్టుబడి సంస్థలకు మార్కెట్‌ ధర కంటే తక్కువకు షేర్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ఆదాయపు పన్ను మినహాయింపు 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిందని, 2020-21 మదింపు సంవత్సరం, ఆ తర్వాతా కొనసాగుతుందని ఓ నోటిఫికేషన్‌ ద్వారా సీబీడీటీ తెలియజేసింది. దివాలా పరిష్కార ప్రక్రియకు ట్రిబ్యునల్‌ అనుమతినిచ్చిన కంపెనీలు, డైరెక్టర్ల బోర్డును రద్దు చేసి కొత్త డైరెక్టర్లను ప్రభుత్వం నియమించిన కంపెనీలు, వాటి అనుబంధ సంస్థల షేర్లను మార్కెట్‌ ధర కంటే తక్కువకు వాటాదార్లు కొనుగోలు చేస్తే ఆదాయపు పన్ను మినహాయింపును పొందొచ్చని అందులో పేర్కొంది. ఒక కంపెనీ షేరును మార్కట్‌ ధర కంటే తక్కువకు కొనుగోలు చేసినప్పుడు వాటాదార్లకు లభించిన ప్రయోజనంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.