close

అవీ... ఇవీ

సుప్రీం కోర్టును ఆశ్రయించిన టాటాసన్స్‌

ముంబయి: దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం టాటాసన్స్‌ నేడు ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. డిసెంబర్‌ 18 సైరస్‌ మిస్త్రీకి అనుకూలంగా ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పును వెలువరించింది. టాటాసన్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఛైర్మన్‌గా, టీసీఎస్‌, టాటా ఇండస్ట్రీస్‌, టాటా టెలిసర్వీస్‌లకు డైరెక్టర్‌గా నియమించాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును సవాలు చేస్తూ టాటా సన్స్‌ ఇవాళ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జనవరి 6న న్యాయస్థానం విచారణ జరిపే అవకాశం ఉంది. టీసీఎస్‌ బోర్డుమీటింగ్‌ జనవరి 9న జరగనుండటంతో సత్వర ఉపశమనం కల్పించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుతో దాదాపు మూడేళ్ల తర్వాత మిస్త్రీ మళ్లీ ఆ పదవిని చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నటరాజన్‌ చంద్రశేఖరన్‌ నియామకాన్ని ఎన్‌క్లాట్‌ నిలుపుదల చేసింది. ఎన్‌.చంద్రశేఖరన్‌ నియామకం చట్ట విరుద్ధమని న్యాయస్థానం పేర్కొంది.

2016 అక్టోబరు 24న మిస్త్రీని తొలగించారు. కార్పొరేట్‌ నియమ నిబంధనలకు విరుద్ధంగా తనను తొలగించారని ఆరోపిస్తూ మిస్త్రీ న్యాయపోరాటం మొదలు పెట్టారు.  అదే ఏడాది డిసెంబరు 19న టాటా గ్రూప్‌ అన్ని సంస్థల డైరెక్టర్‌గా మిస్త్రీ రాజీనామా చేశారు. 20న ఎన్‌క్లాట్‌ను ఆశ్రయించారు. మిస్త్రీని తొలగించడం చట్టవిరుద్ధమని ఎన్‌క్లాట్‌ పేర్కొంది. మిస్త్రీ పునర్నియామక ఉత్తర్వులు నాలుగు వారాల తర్వాత అమల్లోకి రానున్నాయి. ఈలోపు టాటా సంస్థ అప్పీల్‌కు దాఖలు చేసుకోవచ్చని ఎన్‌క్లాట్‌ తెలిపింది. 


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.