close

తాజావార్తలు

బ్యాంకు మోసాలు: 11 ఏళ్లలో 2 లక్షల కోట్లు!

న్యూదిల్లీ: గడిచిన 11 ఏళ్లలో 50 వేలకు పైగా జరిగిన మోసాల్లో బ్యాంకులు రూ.2.05 లక్షల కోట్లు నష్టపోయాయి. అత్యధికంగా కేసులు నమోదైన బ్యాంకుగా ప్రైవేటు రంగ ఐసీఐసీఐ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఉన్నాయి. ఈ మేరకు ఆర్‌టీఐ కింద దాఖలైన దరఖాస్తు కింద ఆర్‌బీఐ ఈ వివరాలను వెల్లడించింది.

2008-09 ఆర్థిక సంవత్సరతం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం 53,334 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో అత్యధికంగా ఐసీఐసీఐ 6,811 కేసులకు గానూ రూ.5,033.811 కోట్లు నష్టపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎస్‌బీఐ మొత్తం 6,793 మోసం కేసులకు గానూ 23,734.74 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2,497 కేసులకు గానూ 1200.79 కోట్లు నష్టపోయినట్లు ఆర్‌బీఐ వివరించింది. మోసం చిన్నదైనా, పెద్దదైనా వివిధ బ్యాంకులు నష్టపోయిన మొత్తాలు ఈ కింది విధంగా..

బ్యాంకు కేసులు మొత్తం (రూ.కోట్లలో)
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2,160 12,962.96
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 2,047 28,700.74
యాక్సిస్‌ బ్యాంక్‌ 1,944 5,301.69
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1,872 12,358.2
సిండికేట్‌ బ్యాంక్‌ 1,783 5,830.85
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1,613 9,041.98
ఐడీబీఐబ్యాంక్‌ 1,264 5,978.96
స్టాండర్ట్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌ 1,263 1,221.41
కెనరా బ్యాంక్‌ 1,254 5,553.38
యూనియన్‌ బ్యాంక్‌ 1,244 11,830.74
కోటక్‌ మహీంద్ర 1,213 430.46
ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ 1,115 12,644.70
ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ 1,040 5,598.23
యునైటెడ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా 944 3,052.34
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ 395 742.31
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ పటియాలా 386 1,178.77
పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ 276 1154.89
యూకో బ్యాంక్‌ 1081 7,104.77
తమిళనాడు మర్చంటైల్‌ బ్యాంక్‌ 261 493.92
లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ 259 862.64
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌ కోర్‌ 274 694.61
జమ్ముకశ్మీర్‌ బ్యాంక్‌ 142 1,639.9
ద ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్ప్‌ ఆఫ్‌ ఇండియా 9 671.66
ధనలక్ష్మి బ్యాంక్‌ 89 410.93
విజయా బ్యాంక్‌ 639 1,748.90
యస్‌ బ్యాంక్‌ 102 311.96
పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ 2 2 లక్షలు

విదేశీ బ్యాంకులు

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంక్‌ 1,862 86.21
సిటీ బ్యాంక్‌ 1,764 578.09
హెచ్‌ఎస్‌బీసీ 1,173 312.10
ద రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్లాండ్‌ 216 12.69

 

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.