డ‌బుల్ ట్యాక్సేష‌న్ నుంచి  ఎన్ఆర్ఐల‌కు ఊర‌ట‌ - No-double-taxation-on-NRI-retirement-corpus
close

Updated : 06/02/2021 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ‌బుల్ ట్యాక్సేష‌న్ నుంచి  ఎన్ఆర్ఐల‌కు ఊర‌ట‌

ఎన్ఆర్ఐలు భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, వారు సాధారణంగా విదేశీ పదవీ విరమణ ఖాతాలలో సంపాదించిన కార్పస్‌కు సంబంధించిన ప‌న్ను సమస్యలను ఎదుర్కొంటారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.  విదేశీ పదవీ విరమణ ఖాతాల్లో వచ్చే డబ్బుపై ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) డబుల్ ట్యాక్సేష‌న్ నుంచి ఉపశమనం కల్పించాలని బడ్జెట్ 2021 ప్రతిపాదించింది. 

 ప్రస్తుతం భారత్‌కు, విదేశాల‌కు ఈ పన్ను చెల్లింపు సమ‌యంతో పాటు, ప‌న్ను వ‌ర్తించే విధానంలో వ్య‌త్యాసం కార‌ణంగా  ఈ స‌మ‌స్య ఎదుర‌వుతోంది. దీన్ని పరిష్కరించడానికి ఆ నిర్దిష్ట ఖాతా నుంచి పేర్కొన్న వ్యక్తి ఆదాయానికి కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా కొత్త సెక్షన్ 89A  ప్ర‌కారం పన్ను విధించే విధానాన్ని ప్ర‌తిపాదించారు.  

ఖాతాలు తెరిచిన సంవత్సరంలో /  కాంట్రిబ్యూష‌న్‌ చేసే సంవత్సరంలో ఉద్యోగులు ప్ర‌వాసులుగా ఉంటారు, మెచ్యూరిటీ సమయంలో / ఖాతా మూసివేసే స‌మ‌యానికి తిరిగి వస్తారు. వారు అప్ప‌టికే భారతదేశంలో పన్ను నివాసితులు అవుతారు. దీంతో  ప‌దవీ విర‌మ‌ణ ఆదాయంపై ఇక్కడ‌, విదేశాల్లో రెండు సార్లు పన్ను విధించడం ఎన్ఆర్ఐల‌కు పెద్ద సవాలుగా మారింది.

ఉదాహరణకు, అమెరికాలో మెచ్యూరిటీ  లేదా ఉపసంహరణ సమయం వరకు వ్యక్తిగత విరమణ ఖాతా (ఐఆర్ఎ) లేదా 401 (k) ఖాతాపై ప‌న్ను వ‌ర్తించ‌దు. దీనికి విరుద్ధంగా, భారత్‌లో ఉద్యోగి అక్క‌డికి వెళ్లిన‌ప్ప‌టినుంచి నివాస స్థితిని బట్టి ప్రతి సంవత్సరం ఐఆర్ఎకు అక్రూవల్ ప్రాతిపదికన పన్ను విధిస్తారు.  కాబట్టి, రెండు దేశాలలో పన్నుల విదింపులో వ్యత్యాసం కారణంగా  ఒకే ఆదాయంపై ప‌లుమార్లు ప‌న్ను చెల్లించాల్సి వ‌స్తోంది.

 ఎన్ఆర్ఐల‌ విదేశీ విరమణ ఖాతాల నుంచి ఉపసంహరణల‌పై పన్నుకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం త్వరలో తెలియజేయ‌నుంది. వారికి ఉపశమనం కలిగించడానికి, ప్రభుత్వం నిర్ధేశించిన‌ రిటైర‌ల్  ఖాతాల నుంచి డబ్బును స్వీకరించేందుకు ఎన్ఆర్ఐలకు ఎదుర‌య్యే  స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌నుంది.


 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని