10 లక్షల పునర్నియామకాలు - 10 lakh reassignments
close
Updated : 19/12/2020 10:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

10 లక్షల పునర్నియామకాలు

 2021 కల్లా రెస్టారెంట్‌ పరిశ్రమ చేపట్టే అవకాశం
డైన్‌అవుట్‌ నివేదిక

దిల్లీ: కరోనా పరిణామాల కారణంగా తీవ్ర ప్రభావానికి లోనైన రంగాల్లో రెస్టారెంట్‌ పరిశ్రమ ఒకటి. లాక్‌డౌన్‌ ఆంక్షలతో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆదాయాలు పడిపోయాయి. దీంతో ఉద్యోగాలు, వేతనాల్లో సంస్థలు కోత విధించాయి. మునుపెన్నడూ ఈ తరహా సంక్షోభ స్థితిని పరిశ్రమ ఎదుర్కోలేదు. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో పాటు కరోనా వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావం నేపథ్యంలో ఇప్పుడిప్పుడే రెస్టారెంటు పరిశ్రమ కోలుకుంటోంది. దీంతో 2021 కల్లా ఆహార సేవల పరిశ్రమ పది లక్షల మందిని పునర్నియమించుకునే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది. రెస్టారెంట్లలో టేబుల్‌ రిజర్వేషన్ల సేవలను అందించే డైన్‌అవుట్‌ ఈ నివేదికను రూపొందించింది. కేవలం రుచికే కాకుండా ఆరోగ్యకర ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు 45% మంది యువత తెలిపారని నివేదిక పేర్కొంది. ఈ దిశగానే రెస్టారెంట్లు కూడా తమ మెనూలో మార్పులు చేసుకుంటున్నాయని తెలిపింది. మరింత మంది వినియోగదారుల డేటాను సేకరించడంపై కూడా అవి దృష్టి సారిస్తున్నాయని పేర్కొంది.  2021 కల్లా డిజటల్‌ మెనూ పద్ధతిని అందిపుచ్చుకునే అవకాశం ఉందని పేర్కొంది.
ఆతిథ్యమే కాదు.. ఆరోగ్యంపైనా శ్రద్ధ
‘ఆన్‌లైన్‌లో ఆర్డర్లు, చెల్లింపుల వల్ల ఆర్డర్లను రాసుకోవడం, ఆర్డర్లలో మార్పు, బిల్లింగ్‌, చెల్లింపులు లాంటి విధుల్లో ఉన్న సిబ్బంది పని సమయం తగ్గింది. దీని కారణంగా ఇతర సేవలపై మరింత సమర్థంగా పనిచేసే వీలు ఏర్పడింది. కరోనా తర్వాత వచ్చిన మార్పుల వల్ల ఆతిథ్యంతో పాటు ఆరోగ్య జాగ్రత్తల విషయంలో వినియోగదారులపై మరింత శ్రద్ధ కనబర్చేందుకు సిబ్బంది సిద్ధంగా ఉంటున్నార’ని ఓ రెస్టారెంటు యజమాని తెలిపారు. ఇక 100 శాతం మంది వినియోగదారులు కాంటాక్ట్‌లెస్‌ లేదా డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఇంటికే ఆహార పదార్థాలను తీసుకెళ్లడం (టేక్‌ఎవే), సరఫరా (డెలివరీ) ధోరణులు వరుసగా 15%, 30.5% చొప్పున పెరిగే అవకాశం ఉందని తెలిపింది. డైనింగ్‌ సేవలు లేకుండా కేవలం ఆన్‌లైన్‌ ఆర్డర్లపై ఆధారపడి సేవలు అందించే క్లౌడ్‌ కిచెన్‌ రెస్టారెంట్ల మార్కెట్‌ వాటా ప్రస్తుతం 13 శాతంగా ఉండగా.. వచ్చే ఏడాదిలో 30 శాతం పెరగొచ్చని నివేదిక అభిప్రాయపడింది. హోమ్‌ చెఫ్‌ల సంఖ్య 2021 కల్లా నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని