టీకా పంపిణీలో భారత్‌ మరో మైలురాయి!  - 20.29 lakh healthcare workers vaccinated across the country
close
Published : 26/01/2021 22:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా పంపిణీలో భారత్‌ మరో మైలురాయి! 

20లక్షల మందికి పైగా టీకా పంపిణీ

దిల్లీ: కరోనా నిరోధానికి వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియలో భారత్‌ మరో మైలురాయిని దాటింది. ఈ నెల 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం 11వ రోజూ (మంగళవారం) విజయవంతంగా కొనసాగింది. ఈ రోజు రాత్రి 7గంటల వరకు దేశవ్యాప్తంగా 20.29లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రిపబ్లిక్ ‌డే సందర్భంగా ఈ రోజు పరిమితంగానే టీకా పంపిణీ చేసిన అధికారులు.. ఐదు రాష్ట్రాల్లో 5615 మందికి మాత్రమే టీకా వేశారు. వీరిలో ఏపీలో 9 మంది, కర్ణాటకలో 429, రాజస్థాన్‌ 216, తమిళనాడు 4926, తెలంగాణ 35 మంది చొప్పున ఉన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 20,29,424మంది టీకా వేయించుకున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఏపీలో ఇప్పటివరకు 1,56,129మంది, తెలంగాణలో 1,30425మంది చొప్పున టీకా అందుకున్నారు.

రాష్ట్రాల వారీగా టీకా పంపిణీ వివరాలు ఇలా..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని