బెడ్‌ త్యాగం చేసి.. ప్రాణాలు కాపాడి.. - 85-year-old vacates hospital bed for 40-year-old patient dies at home
close
Updated : 29/04/2021 10:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెడ్‌ త్యాగం చేసి.. ప్రాణాలు కాపాడి..

చివరకు ప్రాణాలు విడిచిన 85 ఏళ్ల వృద్ధుడు


(నారాయణ్‌ దభల్కర్ ఫైల్‌ ఫొటో)

ముంబయి: కరోనా విలయతాండవం చేస్తున్న ఈ రోజుల్లో ఆసుపత్రులలో పేషెంట్లకు బెడ్లు దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రాణం నిలబడితే చాలు అని స్వార్థంగా ఆలోచించేవాళ్లు లేకపోలేదు. అలాగే ఇతరులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన వాళ్లూ ఉన్నారు.  ఈ తరుణంలో కరోనా సోకి తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న ఒక వృద్ధుడు తన ప్రాణాలను త్యాగం చేసి మరొక వ్యక్తి ప్రాణాలను కాపాడి ఆదర్శంగా నిలిచారు.  85 ఏళ్ల నారాయణ్‌ దభల్కర్ చేసిన త్యాగానికి అందరూ జోహార్లు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ముంబయిలో నివసించే నారాయణ్‌ దభల్కర్ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సభ్యుడు. కనిపించిన వాళ్లందరికీ చాక్లెట్స్‌ ఇచ్చి పలకరించడంతో నారాయణ్‌ను స్థానికంగా అందరూ చాక్లెట్‌ అంకుల్ అని పిలుస్తారు. నారాయణ్‌కు కరోనా వైరెస్‌ సోకడంతో ఏప్రిల్‌ 22న నాగ్‌పూర్‌లోని ఇందిరా గాంధీ ప్రభుత్వ అసుపత్రిలో చేరారు. ఆక్సిజన్‌ స్థాయులు పడిపోవడంతో అతనికి అత్యవసర వైద్య సేవలు అవసరమని వైద్యులు తెలిపారు. అదే సమయంలో ఒక మహిళ తన 40 ఏళ్ల భర్తను హాస్పటల్‌కు తీసుకువచ్చింది. తన భర్త ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆ మహిళ ఆక్సిజన్‌ బెడ్‌ను ఇప్పించమని వైద్యులను కోరింది. హాస్పటల్‌లో ఆక్సిజన్‌ బెడ్ల కొరత ఉండటంతో ఆమె విజ్ఞప్తి మేరకు తన బెడ్‌ను ఆ వ్యక్తికి ఇప్పించమని నారాయణ్‌ వైద్యులను కోరారు. ఈ క్రమంలో ఆయన అత్యవసర వైద్యసేవలు అవసరమని వైద్యులు చెబుతున్నా వినిపించుకోలేదు. పైగా ‘‘నా వయసు 85 ఏళ్లు. నేను చివరాంకంలో ఉన్నాను. ప్రస్తుతం యువకుడి ప్రాణాలను కాపాడటానికి ఆక్సిజన్‌ బెడ్‌ ఎంతో అవసరం. అతనికి పిల్లలు ఉన్నారు. దయచేసి నా బెడ్‌ అతని ఇప్పించండి’’ అని తన బెడ్‌ను ఆ వ్యక్తికి ఇప్పించారు. హాస్పిటల్‌కు వెళ్లిన రెండు గంటలకే డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు. ఇంటి వద్దనే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ ఉండగా వైరెస్‌ తీవ్రత ఎక్కువై మంగళవారం మరణించారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని