రషీద్‌ఖాన్‌ను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు - Aakash Chopra says all the batsmen turned out to be Illeterates while batting against Rashid Khan
close
Published : 20/11/2020 13:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రషీద్‌ఖాన్‌ను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు

(Photo: Aakash Chopra Facebook)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల యూఏఈలో జరిగిన టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌లో హైదరాబాద్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌ను ప్రత్యర్థులు అర్థం చేసుకోలేకపోయారని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో వార్నర్‌ టీమ్‌ ఆఖర్లో వరుస విజయాలు సాధించి అనూహ్యంగా ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ బెంగళూరును ఓడించినా తర్వాత దిల్లీ చేతిలో ఓటమిపాలై మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ జట్టు మొత్తం ప్రదర్శనపై స్పందించిన చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌లో రివ్యూ ఇచ్చాడు. ఈ జట్టులో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా ఎంపిక చేయాలంటే డేవిడ్‌ వార్నర్‌, రషీద్‌ఖాన్‌ ముందు వరుసలో ఉంటారన్నాడు. తాను మాత్రం అఫ్గాన్‌ స్పిన్నర్‌నే ఎంచుకుంటానని చెప్పాడు.

‘‘వార్నర్‌ చివర్లో రెచ్చిపోయాడు. అయితే, రషీద్‌ఖాన్‌ టోర్నీ ఆరంభం నుంచి చివరి వరకు నిలకడగా రాణించాడు. దిల్లీపై రెండుసార్లు 3/7, 3/14 అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. చెన్నై పైనా మెరిశాడు. అలాగే అనేక మ్యాచ్‌ల్లో 20 కన్నా తక్కువ పరుగులే ఇచ్చాడు. హైదరాబాద్‌ గెలుపొందిన చాలా మ్యాచ్‌ల్లో అతడి ఎకానమీ 3- 3.5 మాత్రమే ఉంది. ఇదెంతో అద్భుతమైన బౌలింగ్‌. అతడు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తక్కువ మ్యాచ్‌లు ఆడి ఇక్కడికి వచ్చాడు. యూఏఈలాంటి పిచ్‌లపై అతడి బౌలింగ్‌ను ముందే అర్థం చేసుకోవాలి. లేదంటే తర్వాత అవకాశం ఉండదు. ప్రత్యర్థులు అలా ప్రయత్నించినా ఎవరివల్లా కాలేదు. ప్రతి ఒక్కరూ అతడి బౌలింగ్‌ను అర్థం చేసుకునే విషయంలో విఫలమయ్యారు. కాబట్టి అతడే హైదరాబాద్‌ తరఫున మ్యాన్‌ ఆఫ్‌ టోర్నమెంట్‌గా నిలుస్తాడు’’ అని చోప్రా వివరించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని