మెగాహీరో చిత్రం.. తప్పుకున్న నివేదా? - Aishwarya Rajesh to replace Nivetha Pethuraj in Sai Dharam Tejs upcoming film
close
Published : 01/11/2020 11:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగాహీరో చిత్రం.. తప్పుకున్న నివేదా?

కారణమదేనా..!

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా సినిమా షూటింగ్స్‌ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉన్న సమయంలోనే తమ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి వెంటనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చాలావరకూ దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్స్‌ కాల్‌షీట్స్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పలువురు‌.. సంతకాలు చేసిన సినిమాల నుంచి తప్పుకుంటున్నారని చిత్రపరిశ్రమలో టాక్‌ వినిపిస్తోంది.

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ దేవకట్టా డైరెక్షన్‌లో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నారు. త్వరలో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమాలో మొదట నివేదా పేతురాజ్‌ను కథానాయికగా ఎంపిక చేశారు. డేట్స్‌లో ఇబ్బందులు రావడంతో నివేదా.. సాయిధరమ్‌ తేజ్‌ చిత్రం నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఇందులో కథానాయికగా ఐశ్యర్యా రాజేశ్‌ను చిత్రబృందం ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని