బేర్‌గ్రిల్స్‌తో అక్షయ్‌.. సాహసయాత్ర - Akshay Kumar Bear Grylls Into The Wild With The wild Teaser Looks Crazy
close
Published : 22/08/2020 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బేర్‌గ్రిల్స్‌తో అక్షయ్‌.. సాహసయాత్ర

ఇంటర్నెట్ డెస్క్‌: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ ప్రముఖ సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేయనున్నాడు. అతడితో కలిసి చిత్రీకరించిన సాహసయాత్ర ఎపిసోడ్‌ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘నన్నో పిచ్చోడు అనుకుంటున్నారా.. అయితే పిచ్చోళ్లే ఇలా అడవిలో సాహసాలు చేస్తారు’ అంటూ ఆ టీజర్‌కు తన వ్యాఖ్యానాన్ని జత చేశాడు. కాగా ఆ టీజర్‌ సినీ, సాహసయాత్ర ప్రేమికుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. బేర్‌ సైతం ఓ మోషన్‌ పోస్టర్‌ను పంచుకున్నాడు. ‘జీవితమే ఓ సాహసయాత్ర. ఇలా సాహసాలను ఎంజాయ్‌ చేసే వాళ్లు మరికొందరు ఉన్నారు. లెజెండరీ అక్షయ్‌ కుమార్‌ ఓ ఉత్తమ సాహస యాత్రికుడు’ అంటూ పేర్కొన్నాడు.

ఈ సాహసయాత్ర ఎపిసోడ్‌ సెప్టెంబర్‌ 11న డిస్కవరీ ప్లస్‌ యాప్‌లో విడుదల కానుంది. సెప్టెంబర్‌ 14న డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం కానుంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, నటుడు రజినీ కాంత్‌.. బేర్‌ గ్రిల్స్‌తో కలిసి సాహసయాత్ర చేశారు. వారి తర్వాత ఈ యాత్ర చేసిన మూడో భారతీయుడిగా అక్షయ్‌ నిలిచాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని