మెగా పెళ్లి సందడి.. అందరూ సిద్ధమండీ - Allu and konidela families fly to Udaipu
close
Published : 08/12/2020 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగా పెళ్లి సందడి.. అందరూ సిద్ధమండీ

ప్రైవేటు విమానాల్లో కొణిదెల, అల్లు కుటుంబాలు

హైదరాబాద్‌: ఉదయ్‌పూర్‌లో జరగబోతున్న నిహారిక-చైతన్యల పెళ్లితంతు కోసం కొణిదెల, అల్లు కుటుంబ సభ్యులంతా బయలుదేరారు. ప్రైవేటు విమానాల్లో కుటుంబ సమేతంగా వేడుక కోసం పయనమయ్యారు. అల్లు అరవింద్‌, నిర్మల, అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి, అయాన్‌, అర్హ ఓ విమానంలో.. చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్‌, ఉపాసన మరో విమానంలో ఉదయ్‌పూర్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బాస్‌ చిరు ఫొటో ఉన్న మాస్కు ధరించానంటూ చెర్రీ ఓ స్టిల్‌ షేర్‌ చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి విమానంలో ప్రయాణిస్తున్నామని, పెళ్లి సంబరం మొదలైందని అల్లు అర్జున్‌ ఫొటోలు షేర్‌ చేశారు. ‘అయాన్‌ .. చిలిపి కుర్రాడు, అర్హ.. అల్లు దివా, స్నేహా.. క్యూటీ’ అని కామెంట్‌ కూడా చేశారు. విమానంలో కాబోయే భర్త చైతన్యతో కలిసి ఉన్న చక్కటి చిత్రాన్ని నిహారిక షేర్‌ చేశారు. ఉత్సాహంతో కూడిన ప్రయాణానికి సిద్ధంగా ఉన్నావా? అని చైతన్యను ప్రశ్నించారు.

డిసెంబరు 9న గుంటూరు మాజీ ఐజీ జె. ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యను నిహారిక మనువాడబోతున్నారు. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు శుభకార్యం జరగబోతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌ విలాస్‌ ఈ వేడుకకు వేదికైంది. ఇప్పటికే వధూవరులు, వారి తల్లిదండ్రులు, వరుణ్‌ తేజ్‌, కల్యాణ్‌ దేవ్‌, శ్రీజ, సుస్మిత తదితరులు ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. హోటల్‌ అందాల్ని చూపిస్తూ వీడియోలు పంచుకున్నారు.

 

ఇవీ చదవండి..
పెదనాన్న.. ముద్దుల కూతురు.. ఓ సెల్ఫీ

నిహారిక పెళ్లి.. నాగబాబు భావోద్వేగం..!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని