టీకాతో నేను ప్రజలను చంపేస్తానా: బిల్‌గేట్స్‌ - Am I killing people with vaccines asks bill gates
close
Updated : 24/07/2020 15:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకాతో నేను ప్రజలను చంపేస్తానా: బిల్‌గేట్స్‌

కుట్ర సిద్ధాంతాలను కొట్టిపారేసిన మైక్రోసాఫ్ట్‌ స్థాపకుడు

టీకాలతో ఎప్పుడు డబ్బు కూడబెట్టామో చూపించండని సవాల్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ ఆవిర్భవానికి కారణం తానే అన్న కుట్రసిద్ధాంతాలను అపర కుబేరుడు బిల్‌గేట్స్‌ తిప్పికొట్టారు. మహమ్మారికి తనకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. నిజానికి తాను మహమ్మారి అంతం కోసం భారీయెత్తున ఖర్చుచేస్తున్నానని పునరుద్ఘాటించారు. ఇలాంటి ప్రచారాలను నిలిపివేయాలని సూచించారు.

కొవిడ్‌-19ని అడ్డుకొనేందుకు త్వరగా టీకా రావాలని బిల్‌గేట్స్‌ ఎన్నో సందర్భాల్లో పేర్కొన్నారు. అన్ని దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేయాలని సూచించారు. అసలు ఎలాంటి మహమ్మారి వైరస్‌నైనా ఎదుర్కొనేందుకైనా ఒక వ్యాక్సిన్‌ సిద్ధంగా ఉండాలని గతంలో అన్నారు. వీటి ఆధారంగా బిల్‌గేట్స్‌పై కుట్రసిద్ధాంతాలు ఇంటర్‌నెట్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. కరోనా వైరస్‌ ఆవిర్భావానికి ఆయనే కారణమన్న ఓ వీడియోను యూట్యూబ్‌లో కోట్ల సంఖ్యలో వీక్షించారు. కరోనా వ్యాక్సిన్‌ ద్వారా భూమిపైన కనీసం 15% జనాభాను హతం చేయాలన్నది ఆయన లక్ష్యమని అందులో పేర్కొనడం గమనార్హం.

తనపై సాగుతున్న కుట్ర సిద్ధాంతాలపై బిల్‌గేట్స్‌ స్పందించారు. ‘మహమ్మారి, సామాజిక మాధ్యమాలది ఓ దుష్ట కలయిక. ప్రజలు తేలికైన వివరణ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని ఇతర స్వచ్ఛంద సంస్థల కన్నా ఎక్కువ డబ్బు ఖర్చుచేస్తున్నాం’ అని ఆయన అన్నారు. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు 250 మిలియన్‌ డాలర్లు ఖర్చుచేస్తానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. గత 20 ఏళ్లలో అనేక దేశాల్లో వైద్య సదుపాయాల అభివృద్ధికి ఆయన వందల కోట్ల డాలర్లు విరాళంగా ఇచ్చారు.

‘ప్రజలను టీకాలతో చంపేందుకు ప్రయత్నించి మేం డబ్బు సంపాదించామేమో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరన్నది నిజమే. మాకు వ్యాక్సిన్లతో అనుబంధం ఉంది. కానీ అది మీరు అనుకుంటున్నట్లు కాదు. నిజానిజాలేమిటో అర్థం చేసుకుంటారన్న విశ్వాసం నాకుంది’ అని గేట్స్‌ అన్నారు. 2015లో జికా వైరస్‌ బయటపడ్డప్పుడూ ఆయనపై ఇలాంటి కుట్ర సిద్ధాంతాలే రావడం గమనార్హం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని