నిఖిల్‌తో జోడీ కట్టేందుకు?  - Anupama Parameswaran pair with Nikhil Siddharth
close
Published : 31/07/2020 10:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిఖిల్‌తో జోడీ కట్టేందుకు? 

హైదరాబాద్: వైవిధ్యభరిత చిత్రాలతో మెప్పిస్తూ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు నిఖిల్‌. ఇప్పుడాయన కథానాయకుడిగా పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో ‘18 పేజీస్‌’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కథ అందిస్తున్నారు. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతుంది. 

ఈ నేపథ్యంలోనే ఇప్పుడిందులో నిఖిల్‌కు జోడీగా నటించబోయే నాయిక కోసం వేట ముమ్మరం చేసింది చిత్ర బృందం. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఆ పాత్ర కోసం మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ను సంప్రదిస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్‌ ఈ చిత్రంతో పాటు ‘కార్తికేయ 2’లోనూ నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని