మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం  - Armenia Azerbaijan agree on new humanitarian ceasefire
close
Published : 18/10/2020 18:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం 

యెరవాన్‌: ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ దేశాల సరిహద్దు నాగోర్నో- కరాబాఖ్‌ ప్రాంతంపై ఆధిపత్యం చెలయించడానికి ఈ రెండు దేశాలు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నాయి. తాజాగా ఈ ఏడాది జులైలో ప్రారంభమైన ఆధిపత్య పోరు మొన్న నిన్నటి వరకూ కొనసాగింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని దాడులు చేసుకోవడంతో వందల మంది సైనికులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఆర్మేనియాకు సహాకారం అందిస్తున్న రష్యా రెండు దేశాలతో సుదీర్ఘంగా చర్చించి గతవారం కాల్పుల విరమణ ఒప్పందం చేయించింది. 

ఈ ఒప్పందం జరిగిన వారం రోజుల్లోనే తిరిగి రెండు దేశాల మధ్య మరోసారి కాల్పులు జరిగి పలువురు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల విదేశాంగ మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చి మరోసారి మనవతా దృక్పథంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. నాగోర్నో- కరాబాఖ్‌ ప్రాంతం భౌగోళికపరంగా అజర్‌బైజాన్‌ దేశంలో ఉంది. అయినా అజర్‌బైజాన్‌ విధానాలను వ్యతిరేకించే ఆర్మేనియా బలగాలే ఎప్పటి నుంచో దానిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇదిలా ఉంటే అజర్‌బైజాన్‌కు టర్కీ సహకారం అందిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని