శంషాబాద్‌లో ఆటో డ్రైవర్‌ హల్‌చల్‌ - Auto Driver Hulchal at Shamshabad
close
Published : 02/04/2021 18:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శంషాబాద్‌లో ఆటో డ్రైవర్‌ హల్‌చల్‌

శంషాబాద్‌: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన ఓ ఆటో డ్రైవర్‌ ఫ్లైఓవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. తన వాహనం తిరిగి ఇవ్వాలంటూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శంషాబాద్‌ ఆర్‌జేఐఏ పోలీసు స్టేషన్‌ ఎదుట జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొత్తపేటకు చెందిన నాగరాజు నగరంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మూడు నెలల క్రితం మద్యం సేవించి ఆటో నడపడంతో ఆర్‌జేఐఏ ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకొని వాహనం సీజ్‌ చేశారు. అప్పటి నుంచి నాగరాజు ఠాణా చుట్టూ తిరుగుతున్నాడు. ఎంతకీ ఆటో ఇవ్వకపోడంతో మనస్తాపం చెందిన నాగరాజు శుక్రవారం స్టేషన్‌ ఎదుటే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నాగరాజుకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగిందని ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ తెలిపారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని