‘ఆచార్య’లో మెహబూబ్‌? - Big boss fame mehboob get a chance in chiru acharya
close
Updated : 29/12/2020 12:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆచార్య’లో మెహబూబ్‌?

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ వేదికపై చిరంజీవి మనసు దోచి రూ.10 లక్షల చెక్కును అందుకున్న మెహబూబ్‌కు మరో బంపర్ ఆఫర్‌ దక్కించుకున్నాడని టాలీవుడ్‌ టాక్‌. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’లో మెహబూబ్‌ ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. గతవారం బిగ్‌బాస్‌ సీజన్‌-4 ముగింపు కార్యక్రమానికి చిరు ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. అదే వేదికపై బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు సోహైల్‌, దివి, మెహబూబ్‌లకు బాస్‌ బంపర్‌ ఆఫర్లు ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. సోహైల్‌ సినిమాలో ఒక అతిథిపాత్ర చేస్తానని, దివికి తన తర్వాత చిత్రంలో అవకాశం ఇస్తానని చిరు ప్రకటించారు. అనాథాశ్రమానికి మెహబూబ్‌ చేసిన సాయాన్ని చూసిన ఆయన వెంటనే రూ.10లక్షల చెక్కును మెహబూబ్‌కు బహుమతిగా చేతిలో పెట్టారు. ఇప్పుడు ‘ఆచార్య’ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినట్లు వస్తున్న వార్తలు నిజమైతే మెహబూబ్‌ పంట పండినట్లే. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ మెహబూబ్‌ పాత్ర గురించి ఆలోచిస్తునట్టు సినీవర్గాల భోగట్టా.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని