ప్రభాస్‌ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ - Big surprize for Prabhas fans
close
Updated : 02/12/2020 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. బాహుబలి హీరో ప్రభాస్‌.. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమాను ప్రకటించారు.  గత కొంతకాలంగా వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతోందని సినీ ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తూ వస్తున్నాయి. తాజాగా.. ఆ వార్తను ఖరారు చేస్తూ డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ ఓ పోస్టు చేశారు. తన దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారని నీల్ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. దానికి ‘సలార్‌’ అనే టైటిల్‌ ఖరారు చేయడంతో పాటు ఏకంగా ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేశారు. ‘మోస్ట్‌ వయోలెంట్‌ మ్యాన్‌.. కాల్డ్‌ వన్‌ మ్యాన్‌... ది మోస్ట్‌ వయోలెంట్‌.. సినిమా మీద ప్రేమతో భాషల హద్దులను చెరిపేస్తూ.. భారతీయ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం.. ప్రభాస్‌ గారికి హృదయపూర్వక స్వాగతం’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. హొంబెల్‌ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. కేజీఎఫ్‌,  కేజీఎఫ్‌ 2ను నిర్మించిన విజయ్‌ కిరుగందుర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ చేతిలో భారీ బడ్జెట్‌ సినిమాలే ఉన్నాయి. అందులో ఓం రావత్‌ దర్శకత్వంలో వస్తున్న ‘ఆదిపురుష్‌’ ఒకటి. మరోటి.. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘రాధే శ్యామ్‌’. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన పూజాహెగ్డే కనిపించనుంది. ఇదిలా ఉండగా.. ‘ఆదిపురుష్‌’ను 2022 ఆగస్టు 11న విడుదల చేసి తీరతామని చిత్రబృందం స్పష్టం చేయడం విశేషం. ఇదే కాదందడోయ్‌ మహానటి దర్శకుడు నాగ్‌అశ్విన్‌తో మరో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా కేజీఎఫ్‌ డైరెక్టర్‌తో మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇలా.. అభిమానులకు షాకుల మీద షాకులిస్తూ వస్తు్న్నాడు. దీంతో ఇక నుంచి తన అభిమానులకు ప్రభాస్‌ సినిమాలతో వరుసగా అలరించనున్నాడు. కేజీఎఫ్‌తో ఇండియన్‌ బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాసిన సెన్సేషనల్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. బాహుబలితో పాన్‌ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న డార్లింగ్‌ హీరో ప్రభాస్‌.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు పెరిగాయి. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని