దుబాయ్‌లో కీర్తి.. ఐసోలేషన్‌లోనే వయసైపోతే.?  - Cinema Celebrities on Social Media
close
Published : 19/12/2020 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దుబాయ్‌లో కీర్తి.. ఐసోలేషన్‌లోనే వయసైపోతే.? 

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసోలేషన్‌ ఇలా చేసిందంటూ బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ధవన్‌ ఓ ఫన్నీ పోస్టు చేశాడు. అందులో మూడు ఫొటోలు పంచుకున్నాడు. మొదటి దాంట్లో టీనేజ్‌..  రెండో ఫొటోలో మధ్య వయస్కుడిగా.. చివరి దాంట్లో వృద్ధుడిగా కనిపించాడు. ఇటీవల అతనికి కరోనా సోకిన విషయం తెలిసిందే.

* టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ ట్విటర్‌లో ఒక పోస్టు చేశాడు. నిర్మాత దిల్‌రాజు జన్మదిన వేడుకలో భాగంగా టాలీవుడ్‌ హీరోలు ఫొటోకు ఫోజులిస్తున్న దృశ్యాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 

* సినీ నటుడు, నిర్మాత నాగబాబు తన కూతురు నిహారిక జన్మదిన సందర్భంగా ఆమె చిన్నప్పటి ఫొటోను పోస్టు చేశారు. 

* ముద్దుగుమ్మ కీర్తి సురేశ్‌ దుబాయ్‌లో ఉన్న ఓ ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. హలో దుబాయ్ హా..? మీరు మాట్లాడతారా..? ఎలా ఉన్నారు..? అంటూ తమిళంలో పోస్టు చేసింది.

* హీరో వరుణ్‌తేజ్‌ తన సోదరి నిహారిక బ్లాక్‌అండ్‌వైట్‌ ఫొటోను పంచుకున్నాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని