పేరు చెప్పరు... ప్రచారం సూపరు - Cinemas Title Selection to the upcoming movies of the Tollywood Heroes
close
Published : 30/10/2020 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేరు చెప్పరు... ప్రచారం సూపరు

సినిమాకు కథ ఎంత ముఖ్యమో టైటిల్‌ అంతకంటే ముఖ్యం. ప్రేక్షకుల్ని థియేటర్‌కి తీసుకొచ్చే ప్రధాన మార్గాల్లో టైటిల్‌దే పైచేయి. అందుకే ఈ విషయంలో అగ్ర దర్శక, నిర్మాతల నుంచి అప్పుడే సినీ ప్రయాణం ఆరంభించే వాళ్ల వరకు ఆచితూచి అడుగేస్తారు. ఆకట్టుకునే టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించడమే కాదు దాన్ని ప్రకటించే విషయంలోనూ నిర్మాణ సంస్థలు సెంటిమెంట్‌ను పాటిస్తుంటాయి. కొందరు టైటిల్‌ ప్రకటించిన కొన్నాళ్లకు చిత్రీకరణ ప్రారంభిస్తే, మరికొందరు చిత్రీకరణ మొదలుపెట్టినా టైటిల్‌ రహస్యంగానే ఉంచుతారు. ఇలా వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ జరుపుకొనే క్రమంలో చిత్రానికి ఎన్నో పేర్లు తెరపైకి వస్తుంటాయి. అభిమానుల్లో ఆసక్తి పెంచుతాయి. ఈ మధ్య కాలంలో టైటిల్‌ ఖరారు కాని క్రేజీ ప్రాజెక్టులు ఏంటో చూద్దాం...


క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న చిత్రం ఈ జాబితాలో ముందంజలో నిలుస్తుంది. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘పీఎస్‌పీకే 27’ వర్కింగ్‌ టైటిల్‌తో కొద్ది భాగం షూటింగ్‌ జరిపినప్పటికీ చిత్ర బృందం టైటిల్‌ని ఇంకా ఖరారు చేయలేదు. దాంతో ‘బందిపోటు’, ‘గజదొంగ’, ‘ఓం శివమ్‌’, ‘అంతర్వాహిని’, ‘విరూపాక్ష’ అనే పేర్లు ఫిల్మ్‌ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు.


బోయపాటి శ్రీను- బాలయ్య హ్యాట్రిక్‌ చిత్రం విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది. సినిమా ప్రకటించి, ‘బీబీ 3’, ‘ఎన్బీకే 106’ వర్కింగ్‌ టైటిళ్లతో కొద్దిభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్నా.. ఇప్పటికీ చిత్రబృందం టైటిల్‌ని వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ‘మోనార్క్‌’, ‘టార్చ్‌ బేరర్‌’ అనే పేర్లు పెడుతున్నారనే ఊహాగానాలు వచ్చాయి. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.


ఎన్టీఆర్‌ కథానాయకుడుగా త్రివిక్రమ్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ నిర్మిస్తున్నాయి. త్రివిక్రమ్‌ సినిమా అనగానే ముందుగా టైటిల్‌ ఏం పెడతారా? అనే ఆసక్తి మొదలవుతుంది సినీ అభిమానుల్లో. ఆ ఆసక్తిని మరింత పెంచేందుకే త్రివిక్రమ్‌ కొంచెం ఆలస్యంగానే పేరు వెల్లడిస్తుంటారు. తారక్‌తో చేయనున్న ప్రాజెక్టు విషయంలోనూ ఇదే పరిస్థితి అని చెప్పొచ్చు. ‘ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే పేరు చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది.


ప్రభాస్‌తో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించబోయే ప్రాజెక్టుపై ఇదే తరహా చర్చ మొదలైంది. ‘ప్రభాస్‌ 21’ వర్కింగ్‌ టైటిల్‌తో వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి టైటిల్‌ ప్రకటించలేదు చిత్ర బృందం.


కథకి తగిన పేర్లే కానీ..

విజయ్‌ దేవరకొండ కథానాయకుడుగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పూర్తి యాక్షన్‌ భరితంగా రూపొందే ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. కథకు సరిగ్గా సరిపోయే పేరు అయినప్పటికీ.. దర్శకనిర్మాతలు ఇంకా ఖరారు చేయలేదు. ఇదే పేరు ఖాయం చేస్తారా? మరేదైనా కొత్త పేరు ఎంపిక చేస్తారా? అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సాయి కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ ఓ చిత్రంలో నటిస్తున్నారు. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘బాక్సర్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో కథానాయకుడు బాక్సర్‌గా కనిపించనుండటంతో ఈ టైటిల్‌ తెరపైకి వచ్చింది. ఆయా చిత్ర బృందాలు టైటిల్‌ ఎప్పుడు ప్రకటిస్తాయా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని