close
Array ( ) 1

తాజా వార్తలు

ఉత్తమ నటుడిగా హృతిక్‌ రోషన్‌

దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవం

ముంబయి: ఏటా వేడుకగా నిర్వహించే దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డ్స్ ప్రదానోత్సవం ఈ ఏడాది కూడా అట్టహాసంగా జరిగింది. గురువారం సాయంత్రం ముంబయిలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పలువురు బాలీవుడ్‌, టెలివిజన్‌ తారలు సందడి చేశారు. ఈ ఏడాది అవార్డుల ప్రదానోత్సవంలో.. ఉత్తమ చిత్రంగా ‘సూపర్‌ 30’ అవార్డును సొంతం చేసుకోగా.. ఉత్తమ నటుడిగా హృతిక్‌ అవార్డును గెలుపొందారు. ఉత్తమ రియాల్టీషోగా.. ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 13’ అవార్డును కైవసం చేసుకుంది.

ఈ ఏడాది విజేతలు వీరే..

ఉత్తమ చిత్రం: సూపర్‌ 30

ఉత్తమ నటుడు: హృతిక్‌ రోషన్‌

మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌: కిచ్చా సుదీప్‌

బెస్ట్‌ యాక్టర్‌ ఇన్‌ టెలివిజన్‌ సిరీస్‌: ధీరజ్‌ ధూపర్‌

బెస్ట్‌ యాక్టర్స్‌ ఇన్‌ టెలివిజన్‌: దివ్యాంకా త్రిపాఠి

మోస్ట్‌ ఫేవరెట్‌ టెలివిజన్‌ యాక్టర్‌: హర్షద్‌ చోప్డా

మోస్ట్‌ ఫేవరెట్‌ జోడీ ఇన్‌ టెలివిజన్‌ సిరీస్‌: శృతి ఝా, షబ్బీర్‌ (కుంకుమ భాగ్య)

బెస్ట్‌ రియాల్టీ షో: బిగ్‌బాస్‌ సీజన్‌ 13

బెస్ట్‌ టెలివిజన్‌ సిరీస్‌: కుంకుమ భాగ్య

బెస్ట్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: అర్మాన్‌ మాలిక్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.