లాక్‌డౌన్‌ దిశగా పలు దేశాలు! - Corona Expanding Again in World New Lockdown Rules in Several Countries
close
Updated : 30/10/2020 14:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ దిశగా పలు దేశాలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాప్తి ఆందోళనకర రీతిలో పెరిగిపోతోంది. ఐరోపాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న వేళ అనేక దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితి వస్తోంది. కొద్దిరోజుల్లో ఐరోపా వ్యాప్తంగా కేసులు వేగంగా పెరిగిపోతాయన్న వైద్యుల హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వాలు ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఫ్రాన్స్‌లో వ్యాపారులు మరో నెలరోజులపాటు కార్యకలాపాలు నిలిపివేసేందుకు నిర్ణయించారు. స్పెయిన్‌లో పలు స్థానిక ప్రభుత్వాలు కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిషేధించాయి. రానున్న రోజుల్లో లండన్‌లో రోజుకు 96 వేలకుపైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో ఒక్కరోజులో 5 లక్షల 40 వేలకు పైగా కొత్త కేసులు.. 7 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 4.52 కోట్ల మందికి సోకిన మహమ్మారి 11 లక్షల 85 వేలకు పైగా రోగులను పొట్టనపెట్టుకుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని