PSPK27: ఏ టైటిల్‌ ఖరారు చేస్తారు? - Four titles goes viral for pawan kalyan and krish Movie
close
Published : 16/09/2020 09:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PSPK27: ఏ టైటిల్‌ ఖరారు చేస్తారు?

ఇంటర్నెట్‌డెస్క్‌: పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కేవలం 15రోజుల షెడ్యూల్‌ మాత్రమే పూర్తి చేసుకుంది. ఇటీవల వవన్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రీ లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు క్రిష్‌ ఈ సినిమాను పాన్‌ ఇండియా చిత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర భాషల్లోనూ అందరికీ చేరువయ్యేలా టైటిల్‌ పెట్టాలని భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు టైటిల్స్‌ సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొట్టాయి. వీటిలో ‘విరూపాక్ష’, ‘బందిపోటు’, ‘గజదొంగ’ అనే టైటిల్స్‌ మొదటి నుంచీ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాను పాన్‌ ఇండియా చిత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో అన్ని వర్గాలకు చేరువయ్యేలా ఓ పవర్‌ఫుల్‌ టైటిల్‌ పెడితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోంది. ఇందులో భాగంగానే ‘ఓం శివమ్‌’, అయితే ఎలాంటి ఉందని అనుకుంటోంది. అదే సమయంలో మొదట అనుకున్న ‘విరూపాక్ష’ టైటిల్‌ను పరిశీలిస్తోంది. మరి వీటిలో చిత్ర బృందం దేన్ని ఖరారు చేస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

తాజాగా సినిమా చిత్రీకరణలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో మళ్లీ పనులు మొదలుపెట్టినట్లు సమాచారం. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో వీఎఫ్‌ఎక్స్‌ సన్నివేశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో హాలీవుడ్‌ నిపుణులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ‘ఆక్వామెన్‌’, ‘స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ VII-ది ఫోర్స్‌ అవేకన్స్‌’, ‘వార్‌క్రాఫ్ట్‌’ వంటి చిత్రాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు బెన్‌ లాక్‌ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.

ఇటీవల పవన్‌ కల్యాణ్‌ సినిమాల జోరు పెంచారు. ఆయన కీలక పాత్రలో నటించిన ‘వకీల్‌ సాబ్’ దాదాపు చిత్రీకరణ పూర్తయింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇది కాకుండా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో మరో సినిమాలో పవన్‌ నటిస్తున్నారు. దీని తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రం ఉంటుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని