ట్విటర్: ఇమ్రాన్‌ ఎవరిని ఫాలో అవ్వట్లేదు - Imran Khan Unfollows Everyone on Twitter
close
Published : 09/12/2020 12:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్విటర్: ఇమ్రాన్‌ ఎవరిని ఫాలో అవ్వట్లేదు


ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ తన ట్విటర్ ఖాతాలో ఎవరిని అనుసరించడం లేదు. తన మొదటి భార్యను కూడా అన్‌ఫాలో అయ్యారని, దాంతో ఆయన అనుసరించే వారి సంఖ్య సున్నాకు చేరిందని నెటిజన్లు గుర్తించారు. కానీ, ఆయన్ను అనుసరించే వారి సంఖ్య మాత్రం 12.9 మిలియన్లుగా ఉంది. ఓ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..2010లో ఇమ్రాన్ మొదటి భార్య, సినీ నిర్మాత జెమీమా గోల్డ్ స్మిత్ ట్విటర్ ఖాతాను ప్రారంభించారు. వారిద్దరు తమ వివాహ బంధానికి ముగింపు పలికినప్పటికీ, ఇమ్రాన్ మాత్రం ఆమె ఖాతాను అనుసరిస్తూనే ఉన్నారు. తాజాగా ఆమెను కూడా అన్‌ఫాలో అవ్వడంతో, ఆయన ఫాలో అయ్యే వారి సంఖ్య సున్నాకు చేరింది. దీనిపై ఆయన్ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.  ‘ఇమ్రాన్ ట్విటర్‌లో అందరిని అన్‌ ఫాలో అయ్యారు. ఇక ఆయన ఎవరినీ అనుసరించరు’ అనే అర్థం వచ్చేలా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆయన నిర్ణయానికి గల కారణాలపై మాత్రం స్పష్టత లేదు. 

ఇదిలా ఉండగా..ఫేస్‌బుక్‌లో ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇమ్రాన్ ఆ సంస్థ తీరుపై అక్టోబర్‌లో అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. ఈ లేఖను అక్కడి ప్రభుత్వం ట్విటర్‌లో షేర్‌ చేసి, ఈ ధోరణి ప్రపంచ వ్యాప్తంగా హింసను ప్రోత్సహిస్తుందంటూ విమర్శించింది.

ఇవీ చదవండి:

ఉగ్ర పడగ తొలగిపోతేనే.. సార్క్‌ దేశాల్లో ప్రగతి పరుగులు: మోదీ

పాక్‌ అదుపులో గుజరాత్‌ మత్స్యకారులు!

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని