
తాజా వార్తలు
అమితాబ్ అతిథి కాదు
హైదరాబాద్: ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ‘మహానటి’ తర్వాత నాగ్ అశ్విన్ నుంచి రానున్న చిత్రమిది. దీపికా పదుకొణె కథానాయిక. ఇందులో అమితాబ్ బచ్చన్ నటించనున్నట్టు ఇదివరకే ప్రకటించింది చిత్రబృందం. ఇందులో ఆయనది అతిథి పాత్రే అనుకున్నారంతా. కానీ అమితాబ్ పూర్తిస్థాయి పాత్రలో నటించనున్నట్టు చిత్ర వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభాస్ పాత్రకు సమానంగా అమితాబ్ పాత్ర ఉండనుందట. ప్రభాస్, అమితాబ్, దీపికాలపై భారీ యాక్షన్ సన్నివేశాలనూ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రూపొందించనున్నారు.
Tags :
సినిమా
జిల్లా వార్తలు