close

తాజా వార్తలు

Updated : 27/11/2020 21:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ ఈవెంట్‌ చేయనందుకు సంతోషిస్తున్నా: రోజా

హైదరాబాద్‌: గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘జబర్దస్త్‌’. అనసూయ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. రోజా, మనో, అనసూయల కామెడీ టైమింగ్‌తో పాటు కమెడియన్లు వేసే ఆటో పంచులతో ఈ షో ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ షోకి సంబంధించిన తాజా ప్రోమో ప్రేక్షకులను మెప్పిస్తోంది. 

షోలో భాగంగా హైపర్‌ ఆది టీమ్‌ ‘అక్కా ఎవరే అతగాడు’ స్పూఫ్‌తో, నాన్‌ స్టాప్‌ పంచులతో సందడి చేయనున్నారు. ఈ స్కిట్‌లో భాగంగా ప్రతి ఒక్కరు సెలబ్రిటీ గెటప్‌ ఫొటోలతో వచ్చి.. ‘నా పేరు వర్షిణి, నా పేరు రష్మి అనగా.. ఇంతలో రోజా అందుకొని నా పేరు రోజా.. ఈ ఈవెంట్‌ చేయనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. లేదంటే ఎవరు ఏ బోర్డు వేసుకొని వస్తారో అర్థం కావట్లేదు..’ అంటూ సరదాగా పంచులతో నవ్వులు పూయించనున్నారు. వెంకీ మంకీస్‌, చలాకీ చంటి,  తాగుబోతు రమేష్‌ స్కిట్లు సైతం ఆకట్టుకోనున్నాయి. అంతేకాకుండా రాకెట్ రాఘవ-రోజా మధ్య జరిగే వరుస పంచులతో ఆకట్టుకోనుంది. ఆద్యంతం పంచులతో నవ్వులు పూయించే ఈ కామెడీ ప్రపంచంలోకి వెళ్లాలంటే వచ్చే గురువారం (డిసెంబర్‌ 3)న ప్రసారం కానున్న ‘జబర్దస్త్‌’ చూడాల్సిందే..!Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన