ఆ వివాదంలోకి పవన్‌ పేరెందుకు తెస్తున్నారు? - Janasena reaction on Visakha tonsured incident
close
Updated : 29/08/2020 18:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ వివాదంలోకి పవన్‌ పేరెందుకు తెస్తున్నారు?

అమరావతి: విశాఖ జిల్లా పెందుర్తిలో శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడు జనసేనలో ఉన్నారని, అతను పవన్‌ అభిమాని అంటూ వస్తున్న ప్రచారాన్ని ఆ పార్టీ ఖండించింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనలో పవన్‌ పేరు తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాని పేర్కొంటూ జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. నిందితులు జనసేన పార్టీలో కనీసం సభ్యులు కూడా కాదని స్పష్టంచేశారు.

‘‘పవన్‌ కల్యాణ్‌ అన్యాయానికి కొమ్ముగాసే నేత కాదని ప్రతిఒక్కరికీ తెలుసు. ఎక్కడ అన్యాయం  జరిగినా జనసేన వ్యతిరేకిస్తుంది. బాధితులకు బాసటగా నిలుస్తుంది.  ఈ మధ్య కాలంలో ఏపీలో దళితులపై జరిగిన అకృత్యాలపై పవన్‌ బలంగా స్పందించిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదు. పవన్‌ లక్షలాది అభిమానులు ఉన్న సుప్రసిద్ధ హీరో. నిందితుడు ఆయన అభిమాని అయినంత మాత్రాన ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలో పవన్‌ పేరు తీసుకురావడం గర్హనీయం. ఈ కేసులో తగిన విచారణ జరిపి దోషులను చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నాం. ప్రమేయం లేని విషయాల్లో పార్టీని గానీ, అధ్యక్షుడిని గానీ, మా పార్టీ నాయకుల పేర్లను ప్రస్తావించిన  ప్రస్తావించిన పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని