ఎస్పీబీ మృతి పట్ల బాలీవుడ్‌ సంతాపం - Lata Mangeshkar Tributes S P Balasubrahmanyam
close
Updated : 25/09/2020 19:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్పీబీ మృతి పట్ల బాలీవుడ్‌ సంతాపం

ముంబయి: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల బాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తన మధుర గాత్రంతో ఇన్నాళ్లూ మ్యాజిక్‌ చేసిన ఆయన ఇకపై కూడా పాటల రూపంలో మనతోనే ఉంటారని పేర్కొన్నారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌, ప్రముఖ నటులు అనిల్‌ కపూర్‌, షారుక్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్, అజయ్‌ దేవగణ్‌ తదితరులు సోషల్‌ మీడియా వేదికగా బాలుకు నివాళులర్పించారు.

లతా మంగేష్కర్‌: ప్రతిభాశాలి గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆయనతో కలిసి పలు గీతాలు ఆలపించా. షోలలో పాల్గొన్నా. ఆయన ఇకలేరనే వార్త నన్ను బాధిస్తోంది.

షారుక్‌ ఖాన్‌: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సర్‌ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. లెజెండరీ గాయకుడి ఆత్మకు శాంతి చేకూరాలి. మీ మధుర స్వరాన్ని మేం మిస్‌ అవుతున్నాం.

అక్షయ్ కుమార్‌: బాలసుబ్రహ్మణ్యం జీ మరణవార్త నన్నెంతో బాధించింది. ఈ లాక్‌డౌన్‌లో కొన్ని నెలల క్రితం ఓ కాన్సర్ట్‌ కోసం బాలసుబ్రమణ్యం గారితో ఆన్‌లైన్‌లో మాట్లాడా. ఆయన చాలా ఆరోగ్యంగా ఎప్పటిలాగే కనిపించారు. నిజంగా జీవితాన్ని మనం ఊహించలేం.. ఈ బాధను తట్టుకునే శక్తిని దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటున్నా.

అనిల్‌ కపూర్‌: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ గొప్ప వ్యక్తి.. అద్భుతమైన గాయకుడు. ఆయన నా పాత్రలకు డబ్బింగ్‌ చెప్పడం నా అదృష్టం. నా తొలి తెలుగు, కన్నడ సినిమాల్లోని పాత్రలకు ఆయన స్వరం ఇచ్చారు. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా.

సల్మాన్‌ ఖాన్‌: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సర్‌ గురించి తెలిసిన తర్వాత నా గుండె పగిలింది. మీరు సంగీత ప్రపంచానికి చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.

బోనీ కపూర్‌: ఇవాళ ఓ లెజెండ్‌ను కోల్పోయాం. దాదాపు 16 భాషల్లో వేల గీతాలు ఆలపించారు. ఆయన స్వరం.. తరం, ప్రాంతం అనే తేడా లేకుండా సంగీత ప్రియుల్ని ఒక్కటి చేసింది. మీరు చిత్ర పరిశ్రమకు చేసిన సేవ.. మా జ్ఞాపకాల్లో మిమ్మల్ని ఎప్పటికీ జీవంతోనే ఉంచుతుంది. బాలు కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా.

ఆమిర్‌ ఖాన్‌: బాలసుబ్రహ్మణ్యం గారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. మనం ఓ గొప్ప ఆర్టిస్టును కోల్పోయాం. దీన్ని తట్టుకునే శక్తి దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా.

అజయ్‌ దేవగణ్‌: నా కెరీర్‌ ఆరంభం నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి స్వరం, పాటలు అందర్నీ ఎంతో అలరించాయి. అంతకు ముందు కూడా ఆయన లెజెండే. ఆయన ఇకలేరనే వార్తను తట్టుకోలేకపోతున్నా. కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా.

వివేక్‌ ఒబెరాయ్‌: ఈ ఏడాది చిత్ర పరిశ్రమకు చెందిన కొంత మంది లెజెండ్స్‌ను మనం కోల్పోయాం. సంగీత పరిశ్రమ కూడా మరో గొప్ప గాయకుడ్ని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. 

హేమ మాలిని: ఓ శకం ముగిసింది. గాన గంధర్వుడు కన్నుమూశారు. బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో మరణించారు. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం.

మాధురీ దీక్షిత్‌: మీ స్వరం మిమ్మల్ని మాకెప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీ. పాటలతో మీరు చేసిన మ్యాజిక్‌ ఎంతో గొప్పది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.

రితేష్‌ దేశ్‌ముఖ్‌: అద్భుతమైన పాటలు మాకిచ్చినందుకు ధన్యవాదాలు జీ. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, కోట్లాది మంది అభిమానులకు నా సానుభూతి తెలుపుతున్నా.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని