2021 ఎన్నికలు: టీఎంసీ, భాజపాకు అంత ఈజీ కాదు - Left-Cong tie-up to be a game-changer Adhir
close
Published : 14/09/2020 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2021 ఎన్నికలు: టీఎంసీ, భాజపాకు అంత ఈజీ కాదు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అదిర్‌ రంజన్‌ చౌదరి
వామపక్ష కూటమితో కలిసి పోటీ చేస్తామని వెల్లడి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపాకు అంత సులువు కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అదిర్‌ రంజన్‌ చౌదరి అన్నారు. ఆ ఎన్నికల్లో వామపక్ష కూటమితో కలిసి తాము పోటీ చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో లౌకిక శక్తులను ఏకం చేయడంతో పాటు ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకుపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ విధానాలే బెంగాల్‌లో భాజపా ఎదుగుదలకు బీజం వేశాయని అదిర్‌ రంజన్‌ చౌదరి అన్నారు. ఇతర పార్టీలో చేరిన వారిని తిరిగి వెనక్కి రప్పించి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. 2021లో త్రిముఖ పోరు ఉంటుందన్నారు. అయితే, ఈ తరహా పోరు వల్ల అధికార పార్టీ లబ్ది పొందుతునే వాదనను కొట్టిపారేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుతో పాటు తృణమూల్‌ ఓటు బ్యాంకును కూడా తాము సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.

భాజపా, తృణమూల్‌ నాణేనికి రెండు వైపుల్లాంటివని, రాష్ట్రానికి ఉన్న లౌకిక ముద్రను నాశనం చేశాయని అదిర్‌ ఆరోపించారు. ఒకరు ముస్లింలకు, ఇంకొకరు హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. రెండూ పార్టీలు అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ చేసిందేమీ లేదని విమర్శించారు. వామపక్షాలతో చిన్న చిన్న విభేదాలను పక్కనపెట్టి కూటమిగా పోటీ చేస్తామని చెప్పారు.

పశ్చిమబెంగాల్‌లోని 294 సీట్లకు గానూ 2016లో లెఫ్ట్‌- కాంగ్రెస్‌ కూటమి 76 సీట్లు సాధించగా.. తృణమూల్‌ 211 సీట్లు గెలుచుకుంది. భాజపాకు మూడు సీట్లే దక్కాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకొచ్చేసరికి 42 స్థానాలకు గానూ భాజపా 18 స్థానాలు, తృణమూల్‌కు 22 స్థానాలు దక్కాయి. ఆరు శాతం ఓట్లతో కాంగ్రెస్‌ 2 సీట్లు గెలుచుకోగా.. 7 శాతం ఓట్లు గెలుపొందినప్పటికీ సీపీఎం నేతృత్వంలోని వామపక్ష కూటమికి ఒక్క స్థానం కూడా దక్కలేదు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని