‘దిల్లీ క్రైమ్‌’పై మహేశ్‌ ట్వీట్‌ - Mahesh Babu Praises On Delbhi Crime Team
close
Published : 25/11/2020 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘దిల్లీ క్రైమ్‌’పై మహేశ్‌ ట్వీట్‌

మీ కృషికి దక్కిన సరైన ఫలితమిది..!

హైదరాబాద్‌: నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ‘దిల్లీ క్రైమ్‌’ బెస్ట్‌ డ్రామా సిరీస్‌గా ఇంటర్నేషనల్‌ ఎమ్మీ అవార్డు సొంతం చేసుకోవడంతో.. సదరు టీమ్‌పై సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ‘దిల్లీ క్రైమ్‌’ అద్భుతమైన సిరీస్‌ అని ఆయన కొనియాడారు. ‘‘దిల్లీ క్రైమ్’‌ ఒక అద్భుతమైన వెబ్‌సిరీస్‌..!! ఎమ్మీ అవార్డును సొంతం చేసుకున్న ‘దిల్లీ క్రైమ్‌’ బృందానికి కంగ్రాట్స్. మీ కృషికి దక్కిన సరైన ఫలితమిది’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

దిల్లీ గ్యాంగ్ రేప్‌ కేసును ఆధారంగా చేసుకుని.. అలాంటి హింసాత్మకమైన ఘటనకు పాల్పడిన వ్యక్తిని కనిపెట్టడం అనే అంశంతో ఈ సిరీస్‌ను చిత్రీకరించారు. రిచి మెహ్తా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో షెఫాలి షా డీసీపీగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడులైన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ సినీ ప్రియులనే కాకుండా సెలబ్రిటీలను సైతం ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఎమ్మీ అవార్డును సొంతం చేసుకోవడంతో హృతిక్‌ రోషన్‌, తాప్సీ, సోనాలీబింద్రే, విక్కీ కౌశల్‌, ఆదితిరావు హైదరీ, కరణ్‌ జోహార్‌.. ‘దిల్లీ క్రైమ్‌’ టీమ్‌ను ప్రశంసింస్తూ ట్వీట్లు పెట్టారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని