మహేశ్‌తో డ్యాన్స్‌ చేయడం లేదు: మోనల్ - Monal gajjar on Rumors
close
Updated : 03/02/2021 21:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌తో డ్యాన్స్‌ చేయడం లేదు: మోనల్

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’లో తాను భాగం కాదని నటి మోనల్‌ తెలిపారు. ‘సుడిగాడు’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ గుజరాతీభామ ఆ తర్వాత పలు దక్షిణాది చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల ఓ రియాల్టీ షోలో పాల్గొని అలరించారు. దీంతో ఆమెకు పలు సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

కాగా, బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించిన ‘అల్లుడు అదుర్స్‌’ కోసం ఆమె ఇటీవల ఓ స్పెషల్‌ సాంగ్‌లో కూడా ఆడిపాడారు. ఈ నేపథ్యంలోనే మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’లో ఓ ప్రత్యేక గీతం కోసం చిత్రబృందం ఆమెను సంప్రదించినట్లు కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. సోషల్‌మీడియాలో సైతం జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా సదరు వార్తలపై నటి మోనల్‌ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని అన్నారు. ‘సర్కారువారి పాట’లో తాను ఎటువంటి స్పెషల్‌ సాంగ్‌ చేయడం లేదని వెల్లడించారు.

ఇదీ చదవండి

జ్వరంతో ఉన్నా.. చిరు నాకోసం ఎదురుచూశారు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని