ఎన్టీఆర్‌ను కలవాలనే ఆశతో బతుకుతా! - NTR interacted via video call with his die hard fan Venkanna
close
Published : 04/11/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ను కలవాలనే ఆశతో బతుకుతా!

అభిమానితో వీడియోకాల్‌ మాట్లాడిన ఎన్టీఆర్‌

హైదరాబాద్‌: అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానులను కలిసి ‘మీకు మేమున్నాం’ అంటూ వారిలో ధైర్యాన్ని నింపిన సినీ తారలు ఎందరో ఉన్నారు. అభిమానులు, వారి కుటుంబాలు బాగుండాలని ఎప్పుడూ జాగ్రత్తలు చెబుతుంటారు అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌. ఆడియో ఫంక్షన్స్‌తో పాటు, తన ప్రతి సినిమాలోనూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకన్న అనే ఓ అభిమానితో వీడియోకాల్‌ మాట్లాడి అతనిలో ధైర్యాన్ని నింపారు. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత కలిసి తప్పకుండా సెల్ఫీ ఇస్తానని హామీ ఇవ్వడంతో వెంకన్న ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఎన్టీఆర్‌ను కలవాలనే ఆశతో బతుకుతానని చెప్పడంతో ‘నీకేం కాదు’ అంటూ ఎన్టీఆర్‌ ధైర్యాన్ని నింపారు.

ఎన్టీఆర్‌కు ఆయన అభిమానికి మధ్య జరిగిన సంభాషణ ఇది!

అభిమాని: మిమ్మల్ని లైవ్‌లో చూడటం నాకు మర్చిపోలేని రోజు అన్నా. చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలవటానికి ఎదురు చూస్తున్నా. మీతో నాకు ఒక్క సెల్ఫీ కావాలి. అంతకు మించి ఏమీ వద్దు!

ఎన్టీఆర్‌: కరోనా తీవ్రత తగ్గిన తర్వాత తప్పకుండా నీకు సెల్ఫీ ఇస్తా. మనిద్దరం కలిసి మంచి ఫొటో దిగుదాం!   అప్పటివరకూ నువ్వు మంచి ఆహారం తీసుకుంటూ, విశ్రాంతి తీసుకో.

అభిమాని: మిమ్మల్ని కలవాలనే ఆశతోనే బతుకుతా!

ఎన్టీఆర్‌: అయ్యో..!. నీకూ, నాకూ ఏమీ కాదు. ఇక్కడే ఉంటాం. నీ ఆరోగ్యం జాగ్రత్త. మీ అమ్మని కూడా జాగ్రత్తగా చూసుకో!

అభిమాని అమ్మ: నమస్కారం నాయనా! ఈ బిడ్డ ఆరోగ్యం కోసం చాలా చోట్లకు తిరిగాం. అయినా ఇదిగో పరిస్థితి ఇలా ఉంది!

ఎన్టీఆర్‌: నేను చేయాల్సిన సాయం తప్పకుండా చేస్తానమ్మా. మీ అబ్బాయిని నిశ్చింతగా చూసుకోండి. వెంకన్నా.. మనం తప్పకుండా త్వరలోనే కలుద్దాం! నీ ఆనందమే నిన్ను కాపాడుతుంది!

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని