close
Published : 24/07/2020 23:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘టక్‌ జగదీష్‌’ ఏం చేస్తున్నాడు?

హైదరాబాద్‌: విభిన్న కథలను ఎంచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు నాని. ‘నిన్నుకోరి’ వంటి హిట్‌ తర్వాత నాని - దర్శకుడు శివ నిర్వాణ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. రీతూ వర్మ, రుహానీ శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంతో అల్లుకున్న  కథాంశంతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. దానికి  సంబంధించిన ఎడిటింగ్‌ వర్క్‌ పూర్తయినట్లు నిర్మాత సాహు గారపాటి తెలిపారు.

దీని గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘ఓ చక్కటి కుటుంబ కథాంశంతో చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇప్పటికే 40శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ విరామ సమయంలోనే ఇప్పటి వరకు వచ్చిన  అవుట్‌పుట్‌ను ఎడిట్‌ చేశాం. దీన్ని రీకార్డింగ్‌కు పంపించాం. మిగిలిన  చిత్రీకరణ రాజమండ్రి, పొలాచ్చీ ప్రాంతాల్లోనే చిత్రీకరించాల్సి ఉంది. సెట్స్‌పైకి వెళ్లేందుకు చిత్ర బృందమంతా సిద్ధంగా ఉంది. కరోనా పరిస్థితులు ఎప్పుడు చక్కబడితే అప్పుడు చిత్రీకరణ ప్రారంభించేట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నామ’’న్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని